Amavasya : అమావాస్య రోజు ఇలా చేస్తే ఎంతటి దోషాలైనా హఠాపంచలైపోతాయి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amavasya : అమావాస్య రోజు ఇలా చేస్తే ఎంతటి దోషాలైనా హఠాపంచలైపోతాయి..!

 Authored By aruna | The Telugu News | Updated on :11 August 2023,8:00 am

Amavasya  : అమావాస్య ఎంతో శక్తివంతమైనది. అదే విధంగా ఇది చాలా ప్రధానమైనది. ఒక విధంగా చెప్పాలంటే అమావాస్య ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం అని చెప్పొచ్చు. హిందూ శాస్త్రంలో అయితే అమావాస్య రోజు అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఏ విధమైన విద్య విధానాలు పాటించాలి.. ఏ పరిహారాలు పాటిస్తే మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు వైవాహిక జీవితంలో సమస్యలు సంతాన సమస్యలు, నరదిష్టి సమస్యలు అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఈ సమస్యలన్నీ ఎలా తొలగిపోతాయి. వీటన్నిటికీ పరిహార మార్గం ఏమిటి అసలు ఆ రోజు ఎటువంటి పరిహారాలు పాటించాలి.. అవి ఏ విధంగా చేయాలి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం.. నల్ల ఉప్పు ఉప్పు చాలా శక్తివంతమైనది. నర దిష్టికి, నరగోషకు ఉప్పు ప్రధానమైంది.

అదే విధంగా ఉప్పు అమ్మవారి స్వరూపం కూడా ఉప్పు అదృష్టానికి ఉంటుంది. నకారాత్మక శక్తిని ఆకర్షించే గుణం ఉప్పుకు ఉంటుంది. అందువల్ల చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్లకు కానీ నరదిష్టి నరగోష తగిలినప్పుడు ఇంటికి కానీ మనుషులకు గానీ ఉప్పుతో సహజంగా దిష్టి తీస్తారు.. నల్లఉప్పు ముఖ్యంగా అమావాస్య రోజు ఉపయోగించే దీంతో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైన సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలనుంచి పరిహారాలు లభిస్తాయి. ముఖ్యంగా అమావాస్య రోజు నల్ల ఉప్పుతో చేసుకునే పరిహారాల వలన పరిహారాలు చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం.. అమావాస్య రోజు నల్ల ఉప్పును ఒక పాత్రలో వేయాలి.

Do this on the day of Amavasya Evils will be gone

Do this on the day of Amavasya Evils will be gone

దాంతోపాటు కుంకుమను కూడా ఆ పాత్రలో వేయాలి. ఆ పాత్రలో నీటిని పోయాలి. నల్ల ఉప్పు కరిగిన తర్వాత ఉప్పు కుంకుమ కలిపిన నీటిని మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పోస్తూ రావాలి. మీ చేతిలో తమలపాకును తీసుకొని ఆ తమలపాకులో రావాలి. ఇలా ఒక రౌండ్ అంటే మొత్తం ఐదు రౌండ్లు ఇలా చేయాల్సి ఉంటుంది. నల్ల ఉప్పు కుంకుమ కలిపిన నీటిని అమావాస్య రోజు ఇలా మీ ఇంటి చుట్టూ పోస్తు వెళ్ళాలి.. ఇక రెండోది నిమ్మకాయ. పసుపు కుంకుమ కర్పూర దీపం వెలిగించి తీసుకోవాలి. నిమ్మకాయలు ఇంటి గుమ్మం ముందు కట్ చేసి అంటే సగానికి కట్ చేసి నిమ్మకాయలు పెట్టాలి. పసుపు కుంకుమలు కూడా పెట్టవలసి ఉంటుంది. తర్వాత ఆ చోట కర్పూర దీపాన్ని వెలిగించాలి.

అంతేకాదు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు11 రోజులు 11 సార్లు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అంతేకాదు నల్ల పసుపుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది చాలా అరుదుగా దొరుకుతుంది. అనారోగ్యాలను తక్షణమే తీసివేస్తుంది. మీరు ఎప్పుడైతే ఇంట్లో పూజ చేస్తున్నారో ఆ సమయంలో మాత్రమే ఈ నల్ల పసుపుతో దారాన్ని ధరించాలి. ఇలా నల్ల పసుపు కూడా మీ అనారోగ్యాలను తక్షణమే తీసివేస్తుంది. ఈ అమావాస్యకు నల్ల ఉప్పు నల్ల పసుపుతో ఈ పరిహారాలు చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలు అలాగే అన్ని సమస్యలు తొలగిపోతాయి..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది