Vinayaka Chavithi : వినాయకచవితి రోజు ఈ ఒక్క మంత్రం చదివితే చాలు.. కోటీశ్వరులు అవడం ఖాయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vinayaka Chavithi : వినాయకచవితి రోజు ఈ ఒక్క మంత్రం చదివితే చాలు.. కోటీశ్వరులు అవడం ఖాయం

 Authored By kranthi | The Telugu News | Updated on :17 September 2023,7:38 pm

Vinayaka Chavithi : వినాయక చవితి వచ్చేసింది. ఇక మరో 10 రోజులు గణేష్ పండగే. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం ఉంటుంది. నిజానికి వినాయక చవితి అనేది చాలా సంప్రదాయమైన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చవితి రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు గణేశుడికి శతవరి పత్రాన్ని, నైవేద్యాన్ని పెడితే మీ జీవితంలో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చాలామంది ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్లు వినాయక చతుర్థి నాడు వినాయకుడికి బంతి పూలతో చేసిన మాలను సమర్పించాలి.

ఇంటి ప్రధాన ద్వారం వద్ద బంతిపూల మాలను కడితే ఇంట్లో ఉన్న కలహాలు పోతాయి. ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు ఏర్పడుతాయి. చాలామందికి ఆస్తులకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. అటువంటి వాళ్లు ఆస్తి సమస్యలు పోవాలంటే వినాయకుడికి వెండి నాణెం సమర్పించాలి. అది కూడా వినాయక చవితి నాడు చేయాల్సి ఉంటుంది. ఓం గం గణపతియే నమహ అనే మంత్రాన్ని వినాయకచవితి నాడు 108 సార్లు వినాయకుడి ముందు కూర్చొని జపించాల్సి ఉంటుంది.ఓం గం గణపతియే నమహ అనే మంత్రం చాలా శక్తిమంతమైనది. ఆ మంత్రాన్ని జపిస్తే కష్టాలు తొలిగిపోతాయి. నెరవేరని కోరికలు నెరవేరుతాయి. గణేశుడికి ఐదు యాలకులు, ఐదు లవంగాలు నైవేద్యంగా సమర్పిస్తే వ్యాపారాల్లో ఉన్న సమస్యలు తొలిగిపోతాయి.

do this thing on vinayaka chavithi day

do this thing on vinayaka chavithi day

Vinayaka Chavithi : నెరవేరని కోరికలు కూడా నెరవేరుతాయి

వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. వినాయక చతుర్థి నాడు గణేశ్ మందిర్ కు వెళ్లి దేవుడికి ఆకుపచ్చ బట్టలు సమర్పిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. అందుకే వినాయక చవితి లాంటి ప్రత్యేకమైన రోజు సంవత్సరంలో ఒకసారి మాత్రమే వస్తుంది. కష్టాల్లో ఉన్న వారికి ఆ రోజు ఒక వరం అనే చెప్పుకోవాలి. ఆ రోజు మీరు ఈ మంత్రాన్ని జపిస్తే సమస్యలు తీరి కోటీశ్వరులు అవుతారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది