Ugadi Festival : ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు, దాని ప్రాశస్త్యం ఏమిటో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ugadi Festival : ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు, దాని ప్రాశస్త్యం ఏమిటో తెలుసా?

Ugadi Festival : తెలుగు సంవత్సరాది ప్రారంభమయ్యే ఉగాది పండుగ గురించి తెలియని వారుండరు. తెలుగు వారంతా ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండుగను యుగాది అని కూడా పిలుస్తారు. యుగాది అనగా యుగ+ఆది అని అర్ధము. యుగము అనగా జత అని అంటే ఉత్తరాయణము, దక్షిణాయనము ఈ రెండిటిని కలిపి మనం ఒక సంవత్సరంగా పిలుస్తాము. అది ఈ ఉగాది నుంచి అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుండి మొదలవుతుంది. మరోలా వివరించాలంటే ఉగాదిలో ఉ […]

 Authored By pavan | The Telugu News | Updated on :19 March 2022,6:00 am

Ugadi Festival : తెలుగు సంవత్సరాది ప్రారంభమయ్యే ఉగాది పండుగ గురించి తెలియని వారుండరు. తెలుగు వారంతా ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండుగను యుగాది అని కూడా పిలుస్తారు. యుగాది అనగా యుగ+ఆది అని అర్ధము. యుగము అనగా జత అని అంటే ఉత్తరాయణము, దక్షిణాయనము ఈ రెండిటిని కలిపి మనం ఒక సంవత్సరంగా పిలుస్తాము. అది ఈ ఉగాది నుంచి అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుండి మొదలవుతుంది. మరోలా వివరించాలంటే ఉగాదిలో ఉ అనగా నక్షత్రం అని… గా అంటే గమనం అనీ అర్థాలు. అలా ఉగాది అంటే నక్షత్ర గమనాలను ఈ రోజు నుంచి లెక్కించడం అని అర్థం.తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది పండుగను… ప్రతీ ఏటా చైత్ర శుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు. ఈ పండుగను తెలుగు ప్రజలు చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటారు.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోను జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పత్వాగా, తమిళులు పుత్తాండుగా, పంజాబ్ లో వైశాఖిగా అభివర్ణిస్తూ పండుగను జరుపుకుంటారు. అయితే ఉగాది రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేస్తారు. ఆ తర్వాత కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేస్తారు. ఆ తర్వాత రకరకాల పండి వంటలు, షడ్రుచులతో ఉగాది పచ్చడని చేసుకొని తింటారు. ఆ తర్వాత పంచాంగ శ్రవణం కూడా చేస్తుంటారు. తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పుతో ఈ ఉగాది పచ్చడని తయారు చేస్తారు. దీన్ని ముందుగా దేపుడికి సమర్పించి పూజ చేసిన అనంతరం తింటారు. అయితే ఆ పచ్చడిలో ఎక్కువ ఏ రుచి తగిలేతే.. ఆ ఏడాదంతా తమ భవిష్యత్తు అలాగే ఉంటుందని భావిస్తారు. కాబట్టి ఉగాది పచ్చడి తయారు చేసే వారంతా చాలా జాగ్రత్తగా అన్నింటిని సమపాళ్లలో కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.మన పురాణాల ప్రకారం…

do you know importance of ugadi festival

do you know importance of ugadi festival

సృష్టికర్త అయిన బ్రహ్మ ఉగాది రోజునే సృష్టిని ప్రారంభించాడట. ఆ నమ్మకం వల్లనే తెలుగు ప్రజలు కొత్త సంవత్సరాదిని ఈ రోజు ప్రారంభిస్తారు. దీనినే ఉగాది అని పిలుస్తారు. అయితే మనకు ఒక సంవత్సరం గడిస్తే… అది బ్రహ్మ దేవుడికి ఒక రోజుతో సమానం అంట. అలా మన ప్రతి ఉగాదితో ఆయనకు ఒక కొత్త రోజు మొదలు అవుతుంది. అలాగే పూర్వం సోమకారుడు అనే రాక్షసుడు ఒక నాడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలాండట. ఆ తర్వాత బ్రహ్మకు దొరక్కుండా ఉండేందుకు సముద్రంలో దాక్కుంటాడు. అయితే దొంగను పట్టుకునేందుకు బ్రహ్మ దేవుడు విష్ణువు సాయం కోరతాడు. వెంటనే విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్లి సముద్రంలో ఉన్న సోమకారుడిని పట్టుకుంటాడు. ఆ తర్వాత వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు. అలా బ్రహ్మకు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే వేదాలను అప్పగించాడు కాబట్టి అదే రోజు నుంచి సృష్టి తిరిగి ప్రారంభం అయిది. అయితే ఆ రోజునే మనం ఉగాది పండుగగా నిర్వహించుకుంటున్నాం.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది