Sankranti Festival : సంక్రాంతి పండుగ అసలు ఎందుకు జరుపుకుంటామొ మీక తెలుసా..?
Sankranti Festival : తెలుగు రాష్ట్రలలో అత్యంత పెద్ద పండుగ సంక్రాతి. ఈ పండుగ వెనుక అనేక విశేషాలు ఉన్నాయి. అవి తెలుసుకుందాం…సంక్రాంతి తిథులతో సంబంధం లేని పండుగ. ఇది సూర్యమానం ప్రకారం జరుపుకొనే పండుగ. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలం దీన్ని మకర సంక్రమణముగా పిలుస్తారు. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో సూర్యుడు సంచరించిన కాలాన్ని ఉత్తరాయణంగా పరిగణిస్తారు.
శారీరక పరిశ్రమకు, పూజలకు, దేవతా ప్రతిష్టలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణం. రవి అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండి మొదలై, ఆ తరువాతసింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు, ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము.

Do you know the Sankranti festival
పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము.ఈ పండుగ రోజు తప్పక ప్రాతఃకాల స్నానం, పూజ, ఇంటి ముందు రంగవళ్లిలు, దానాలు, ధర్మాలు, ఆటలు, పాటలు, పశువుల ఆరాధన, అందరినీ సమానంగా చూడటం వంటి పనులు తప్పక చేయాలి.