Vinayaka Chavithi : వినాయక చవితి రోజు పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యకండి. మహా పాపం చుట్టుకుంటుంది. కష్టాల పాలవుతారు. మరి వినాయక చవితి రోజు ఎటువంటి పనులు చేయాలి.. ఎటువంటి పనులు చేయకూడదు అనే విశేషాలు మనం తెలుసుకుందాం.. వినాయక చవితి రోజు ప్రతిరోజు ఏ ఏ పనులు చేయాలి. ఏ ఏ పనులు చేయకూడదు. అనేది శాస్త్ర ప్రకారం మహాగణపతిని ఎలా పూజించాలి అనే విశేషాలు కూడా ఈ మనం తెలుసుకుందాం.. మహా గణపతిని పూజించేటువంటి వాళ్ళు వినాయక చవితి మండపాల్లో కానీ ఇళ్లలో కానీ కొన్ని పనులు ఎట్టి పరిస్థితులను చేయకూడదు. అలా చేసినట్లయితే మహాగణపతి అనుగ్రహం బదులు ఆయనకు ఆగ్రహం కలిగి మనల్ని శపిస్తాడు. ఏ ఏ పనులు చేయవచ్చు.. ఏ ఏ పనులు చేయకూడదు అనేది మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా ఈ విషయాలు మీరు తెలుసుకోండి. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 18 వ తారీకు సోమవారం రోజు జరుపుకోవాలని చాలా పంచాంగాల్లో పెద్దలు మనకు చెప్పి ఉన్నారు. అలాగే స్వామివారి పూజకు సంబంధించి వినాయక చవితి రోజు స్వామివారికి పత్రితో పూజిస్తాం.. అయితే తులసీదళాన్ని అసలు స్వామివారికి సమర్పించకూడదు.. వినాయక పూజలో తులసీదళం అనేది నిషిద్ధం సాధ్యమైనంత వరకు దూర్వాయుర్మాన్ని మహాగణపతికి సమర్పించాలి. అంటే గరిక. మహాగణపతికి చాలా ప్రీతి కాబట్టి గరికను గణపతికి సమర్పించండి. తులసిని పూజలో నిషేధించండి. ఇక రెండవ తప్పు వినాయక చవితి రోజు పొరపాటున కూడా చంద్రుని చూడకూడదు.

చంద్ర దర్శనం నిషిద్ధమని మనకు పురాణాలు చెబుతున్నాయి. వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుని చూస్తారో వాళ్లకు నీలాపనిందలు వస్తాయని చెప్పారు. కాబట్టి ఆ రోజు పొరపాటున కూడా చంద్రుని చూడకూడదు. మట్టి విగ్రహానికి గనక తెల్లని పంచ లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఆ తెల్లని పంచెను మీరే కట్టండి. అది చాలా శ్రేష్టం అలా ఉన్నటువంటి మహా గణపతికి పూజ చేసుకోవడం అనేది శ్రేష్టం అలాగే మార్కెట్లో ఎన్నో రకాల వినాయక విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి వినాయక విగ్రహం అన్నది మట్టితో చేసింది ఉండాలి.
ఎంతో ప్రశాంతంగా పూజ చేసుకొని 21 రకాల పత్రి సమర్పించి నవకాయ పిండి వంటల్ని ఆ స్వామి వారికి సమర్పించి కుటుంబ సభ్యులు అందరూ కలిసి భజనలతో స్వామివారిని పూజించుకుని అర్జించుకుని ఈ నవకాయ పిండి వంటలు స్వామివారికి నివేదించి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. ఆ గంగమ్మ తల్లి ఒడిలోకి స్వామివారిని సాగానంపుతూ భజనలు చేసే స్వామివారిని మన ఇంటికి ఆహ్వానించింది మొదలు. గంగమ్మ ఒడిలోకి చేరేవరకు కూడా మన ఇంట్లో ఎటువంటి వాదనలు వివాదాలు, గొడవలు, మద్యం సేవించడం, మాంసం తినడం ఇలాంటివన్నీ కూడా నిషేధించాలి. ఎంతో ప్రశాంతంగా స్వామివారు మన ఇంటికి వచ్చి ఆశీర్వది ఉన్నారు అనేటువంటి భావనతో ఉండాలి.
ఒక అతిధి మన ఇంటికి వస్తే మనం ఎలా ప్రవర్తిస్తామో అలా స్వామివారి మన ఇంటికి వచ్చినప్పుడు ఒక అతిధిని చూసినట్టు సగరవంగా చూడాలి. అలా స్వామివారి పూజలు చేసుకుని ఎంతో నియమనిస్టలతో స్వామివారికి పూజలు సమర్పించాలి. ఈ విధంగా చేసినట్లయితే ఆ స్వామివారు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు…