Ganesh Chaturthi : వినాయక చవితి రోజు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి…!
ప్రధానాంశాలు:
Ganesh Chaturthi : వినాయక చవితి రోజు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి...!
Ganesh Chaturthi : హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితిని ప్రతి ఏడాది భద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిధిన జరుపుకుంటారు. గణేశ చతుర్థి నుంచి అనంత చతుర్దశి తిధి వరకు వినాయకుడిని భక్తులు పూజిస్తారు. భద్రపద మాసం వినాయకుడికి అంకితం చేయబడింది కావున ఈ సమయంలో గణేశుడిని పూజించడం శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీ శనివారం న జరుపుకుంటారు. అలాగే వినాయకుడి విగ్రహ నిమజ్జనాన్ని సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది.
Ganesh Chaturthi విగ్రహ ప్రతిష్టాపనకు శుభముహూర్తాలు..
హిందూ పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 7వ తేదీన 11: 03 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:34 వరకు విగ్రహ ప్రతిష్టాపనకు మరియు పూజకు అనుకూలమైన సమయం. అంతేకాకుండా వినాయకుడి ఆరాధన ప్రతిష్టాపన కోసం మధ్యాహ్నం 2: 30 నిమిషాల సమయం వరకు గణేశుడిని పూజించుకోవచ్చు.
వినాయక చవితి రోజున చేయవలసిన పనులు…
-వినాయక చవితి రోజున ఇంటి పూజ స్థలంలో లేదా ఈశాన్య దిశలో ఎరుపు రంగు వస్త్రం మీద గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
-వినాయకుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఆ రోజున ఎర్రటి పూలు పండ్లు ఎర్రచందనం వంటివి పెట్టాలి.
-వినాయకుడికి ఇష్టమైనవి ఏర్పాటు చేసిన తరువాత విగ్రహాన్ని అందంగా అలంకరించుకొని పూజించుకోవాలి.
వినాయక చవితి రోజున చేయకూడని పనులు…
– వినాయక చవితి రోజున విరిగిన విగ్రహాలను ప్రతిష్టించడం అశుభంగా భావిస్తారు.
– పూజలో తులసి దళాన్ని మరియు మొగలి పువ్వులను పొరపాటున కూడా ఉపయోగించకూడదు. ఒకవేళ ఇలా చేసినట్లయితే ఆ పూజకు ఎలాంటి ఫలితం ఉండదు.
-వినాయక చవితి రోజున ఉపవాసం ఉండి పూజలు చేసే వ్యక్తి యొక్క మనసు స్వచ్ఛంగా ఉండాలి. బ్రహ్మచారాన్ని అనుసరించాలి.
-వినాయక చవితి సందర్భంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎలాంటి గొడవలు పడకూడదు.
వినాయక చవితి పూజ విధానం…
వినాయక చవితి రోజున విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రదేశంలో గంగా జలాన్ని చల్లి శుభ్రపరచండి. ఆ తరువాత ఒక పీట మీద విగ్రహాన్ని ప్రతిష్టించి చందనం మరియు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి. అలాగే వినాయకుడి తొండానికి చందనం కుంకుమతో అద్ది పూలను సమర్పించండి. నెయ్యి దీపాలను వెలిగించాలి. ఆ తరువాత అగరబత్తులను వెలిగించండి. గణేశుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు కుడుములు నైవేద్యంగా సమర్పించండి. గణపతికి హారతి ఇచ్చి ” ఓం గం గణపతయే నమః ” అనే మంత్రాన్ని పఠించండి. ఇలా పూజించడం వలన గణపతి పూజ ఫలితం దక్కుతుంది.