Mauni Amavasya : ఫిబ్రవరి 9 అత్యంత శక్తివంతమైన మౌని అమావాస్య.. రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఇలా చేయండి చాలు…!!

Authored By aruna | The Telugu News | Updated on : 8 February 2024, 7:00 am

Mauni Amavasya : మన హిందూమతంలో అమావాస్యకు ఎంతో కీలకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య తిధి అనేది విష్ణుమూర్తికి ఎంతో ప్రత్యేకంగా అంకితం చేయబడి ఉంటుంది. ప్రతినెలా కూడా అమావాస్య వస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలలో వచ్చేటటువంటి అమావాస్య మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే మాఘ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అమావాస్యలు మౌని అమావాస్య అని అంటూ ఉంటారు. ఈ రోజున పవిత్ర నది స్నానం దానాలకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉండే ఈరోజు మౌనవ్రతం ఉండి ఉపవాసం చేస్తే కనుక పుణ్యఫలం దక్కుతుందని భక్తులు నమ్మకం. ఫిబ్రవరి 9వ తేదీన మౌని అమావాస్య వచ్చింది. ఈ మౌని అమావాస్య రోజు పితృదేవతలని ప్రసన్నం చేసుకునేందుకు తర్పణం పిండి ప్రదానం పవిత్ర స్నానం ఆచరించడం లాంటి పనులు చేస్తూ ఉంటారు.

ఈ మార్గ అమావాస్య రోజున పితృ దోషం తొలగిపోవడానికి కూడా ప్రత్యేకమైనటువంటి నివారణను పాటిస్తే ఎంతో మంచిది అని చెప్పవచ్చు.. ఇంతటి విశేషమైనటువంటి అతింద్రియ శక్తులు కలిగిన ఈ మౌని అమావాస్య రోజున మీరు ఎవరికి చెప్పకుండా రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ విధంగా చేస్తే మీరు కచ్చితంగా కోటీశ్వరుడు అవ్వడం ఖాయం. ముఖ్యంగా ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా చేస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి ఆ మహా సముద్రంలో నుంచే ఉప్పు కూడా ఉద్భవించింది. కాబట్టి ఉప్పుకు ప్రత్యేకగా లక్ష్మీదేవిని చూస్తూ ఉంటాం. మరి ఆ ఉప్పుతో మనం చేసే ప్రయోజనాలు ముఖ్యంగా పరిహారాలు ఎంతో విశేషంగా ఆకట్టుకుంటాయి.. ఈ అమావాస్య రోజున చాలామంది పూజలు చేసుకుంటూ ఉంటారు.

అయితే మంచి పనులు లేదా శుభకార్యాలు ఇలాంటివి మొదలు పెట్టకపోయినా అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజలు చేయడం మాత్రం మన ఆనవాయితీ కాబట్టి.. ఈ విధంగా అమావాస్య రోజున సాయంత్రం 6 గంటల తర్వాత మీరు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసి భక్తిశ్రద్ధలతో మీ సంకల్పాన్ని చెప్పుకొని ఈ పరిహారాన్ని పాటించండి. ఇప్పుడు ఒక గాజు గిన్నెలాంటిని తీసుకోండి. దీనిలో గళ్ళు ఉప్పు నింపండి.దీనిలో కొంచెం పసుపు కుంకుమ కూడా వేసి రాత్రంతా మీ ఇంట్లో ఉంచండి. ఇక రాత్రంతా ఈ ఉప్పుతో ఉన్నటువంటి గాజు పాత్రని మీ ఇంట్లోనే ఏదో ఒక మూలగా ఉంచండి. ఇక మర్నాడు ఏదైతే ఉందో ఈ ఉప్పుని అలాగే దూరంగా తీసుకెళ్లి లేదంటే ఏదైనా నీటిలో గాని కలిపి వేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీపై ఉన్నటువంటి అన్ని ప్రతికూల ఫలితాలు తొలగిపోయి మీరు కోటీశ్వరులుగా మారెందుకు ఎన్నో కీలకమైన అవకాశాలు మీ ముందుంటాయి..

Advertisement

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి