Nageshvara Jyotirling Temple : నాగేశ్వర జ్యోతిర్లింగం విశేషాలు ఇవే !
సముద్రతీరాన ఉన్న జ్యోతిర్లింగంలో ఇది ఒకటి. రామేశ్వరంలో ఒకటి ఉన్నాయి. రాక్షస సంహారం కోసం వెలసిన జ్యోతిర్లింగం ఇది.
పురాణగాథ
దేశంలోని పశ్చిమ సముద్ర తీరాన, దారకుడనే రాక్షసుడు, ‘దారుక’ అనే తన భార్యతో కలసి ప్రజలను చిత్రహింసలకు గురిచేయసాగాడు. యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ, ముని జనులను హింసించసాగారు. వీరి హింసను తట్టుకోలేని ఋషులు ఔర్వమహర్షికి విన్న విన్చుకున్నారు. ఔర్వమహర్షి ఆ రాక్షస దంపతులను సతీసమేతంగా మరణించునట్లుగా శపించాడు. ఆ మునిశాపం భూమి పై పనిచేస్తుంది. కనుక, రాక్షసదంపతులు సముద్రమధ్యంలో నివాసమేర్పరచుకుని సముద్రయానం చేసేవారిని పీడించసాగారు. ఇలా కనబడిన ప్రయాణీకులందరి ధనవస్తువులను అపహరిస్తూ చెరసాలలో బంధించసాగారు.
అలా బంధింపబడినవారిలో సుప్రియుడొకడు. ఇతడు పరమ శివ భక్తుడు. రాక్షసబాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగా, దివ్యతేజః పుంజము కళ్ళు మిరిమిట్లు గోలుపునట్లు ప్రకాశించింది. ఆ కాంతికి దారుకునితోపాటు సమస్త రాక్షసులు నేలకొరిగారు. అక్కడ పరమశివుడు నాగారూపమై జ్యోతిర్లింగమై వెలిసాడు. ఈ స్వామిని దర్శించి, సేవించుకున్నవారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధిస్తుందని ప్రతీతి. “నాగేశ్వర లింగము”.
గుజరాత్ రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళవలెను. (గోమతి ద్వారక నుంచి సుమారు 14 కి.మీ. దూరము) నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాడుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి. ఈక్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం ఉంది.