శివుడికి ఎన్ని ముఖాలో మీకు తెలుసా ?
శివుడు.. సర్వమంగళ స్వరూపుడు. వ్యక్త అవ్యక్త రూపం కలిగినవాడు. లింగరూప ధారి అయిన శివుడు మనకు అన్ని దేవాలయాల్లో ఎక్కువగా లింగరూపంలో దర్శనమిస్తాడు. అయితే ఆ స్వామికి ఎన్ని ముఖాలు అంటే లింగం కదా అని అంటారు. కానీ శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5, ముఖాలు ఉంటాయి.
అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులని చూస్తుంటే ఐదవ ముఖం ఊర్థ్యముఖమై (పైకి చూస్తూ /
ఆకాశంవైపు చూస్తూ ) ఉంటుంది, ఐదు ముఖాలకి ఐదు పేర్లు అవి వరుసగా…
1, సద్యోజాత,ముఖం, ( పశ్చిమ )
2, తత్పురుష,ముఖం, ( తూర్పు )
3, అఘోర,ముఖం ( దక్షిణ )
4, వాసుదేవ,ముఖం ( ఉత్తర )
5, ఈశాన, ముఖం ( ఆకాశం )
శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం, మనకు ప్రతీ శివాలయములోనూ ఈ ఐదు ముఖాలు ఉంటాయి. శైవాగమనంలో చెప్పినట్లుగా,
మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరునే స్మరించాలి.
ఆ అయిదు ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము ( మోక్షము ) లభిస్తుంది.