Laxmi Devi : వీటిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం !
Laxmi Devi : జగత్తు అంతా లక్ష్మీ మయం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు అన్ని సమకూరుతాయి. అయితే లక్ష్మీ అనుగ్రహం కోసం మన పూర్వీకులు అనేక రకాల పరిహారాలు,పూజలు, పద్ధతులను ఆచరించేవారు. వాటిలో అత్యంత ప్రభావమంతమైన గోమతి చక్రాల గురించి తెలుసుకుందాం…
Laxmi Devi : గోమతిచక్రాలు
గోమతి చక్రాలు అరుదైన సహజసిధ్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి నది నందు లభిస్తాయి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులారాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో ఇవి రూపు దిద్దుకుంటాయి. ఈరెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం. ఈశుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల వల్ల లక్ష్మీ అనుగ్రహం లభిస్తంది.
Laxmi Devi : జ్యోతిషం ప్రకారం
– జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు ప్రేమ, దాంపత్య సౌఖ్యం,సౌభాగ్యాలకు లైంగిక సామర్ధ్యానికి కారకత్వం వహిస్తుండటం వలన గోమతి చక్రాన్ని ధరించిన వారికి పైన పేర్కొన్నవన్నీ పుష్కలంగా లభిస్తాయి. గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది.దీనినే “నాగ చక్రం” అని “విష్ణు చక్రం” అని కూడ అంటారు. ఇది నత్త గుళ్ళ ని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని “నత్త గుళ్ళ “స్టోన్ అని కూడ అంటారు.
Laxmi Devi : గోమతి చక్ర విశేషాలు
– గోమతిచక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది.గోమతిచక్రం ముందుభాగం తెల్ల గాను, కొన్ని ఎర్రగాను ఉంటాయి. తెల్లగా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకల కార్యసిధ్ధికి, ఆరోగ్య సమస్యలకి, ధరించటానికి ఉపయోగపడతాయి. ఎర్రగా ఉన్న గోమతిచక్రాలు వశీకరణానికి, శత్రునాశనానికి, క్షుద్రప్రయోగాలకి, తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి. గోమతిచక్రాలలో ఆరు, తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి. సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి, తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి. జాతకంలో కుజ శుక్రు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు గోమతిచక్ర ధారణవల్ల నివారించబడతాయి.
– ఒక్క గోమతిచక్రాన్ని త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి కలుగుతుంది.గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నరదృష్టి భాదల నుండి విముక్తి కలుగుతుంది.బాలారిష్ట దోషాలు కూడ పోతాయి. రెండు గోమతిచక్రాలను బీరువాలో గాని పర్సు లో గాని ఉంచితే దనాభివృధ్ధి ఉండి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.