Sravana Masam : మీరు ఈ శ్రావణ మాసంలో ఉపవాసం చేస్తున్నారా… అయితే మీ డైట్ లో వీటిని చేర్చుకోండి..
Sravana Masam : శ్రావణమాసంలో అందరూ ఎక్కువగా ఉపవాసం ఉంటూ ఉంటారు ఈ శ్రావణమాసం లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం, అలాగే శివ పార్వతికి కూడా చాలా ప్రీతికరమైనది. ఈ మాసంలో చాలామంది శివపార్వతులను ఆరాధిస్తూ ఉంటారు. అలాగే ప్రత్యేకంగా ఉపవాసం చేస్తూ ఉంటారు. ఈ మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఆరోగ్యం పై చేడు ప్రభావం కలగకుండా కొన్ని రకాల ఫ్రూట్స్ ను తీసుకోవచ్చు. కానీ కొందరు ఏమీ తినకుండా ఉంటూ ఉంటారు. అలా చేయడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఆరోగ్యం పై శ్రద్ధ ఉంచుకోవాలి.
అయితే ఈ శ్రావణ మాసంలో ఉపవాసం ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో చూద్దాం. ఈ మాసంలో పూజను భక్తిశ్రద్ధలతో చేయమన్నాడు కానీ, ఆకలితో బాధపడుకుంటూ, పూజ చేయమని ఏ దేవుడు ఎప్పుడు చెప్పలేదు. మీ తృప్తి కోసం పూజ ముగించిన అనంతరం పండ్లను స్వీకరించవచ్చు . కానీ ఏమీ తినకుండా ఉపవాసం ఉండటం వలన, కొందరికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అలాగే బీపీ తగ్గిపోవడం. లాంటి సమస్యలు అన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే, కొన్ని రకాల ఫ్రూట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి.
ఈ సమయంలో సలాడ్ లు చేసుకుని తినాలి. కీరదోస ము, టమాటా ముక్కలు సలాడ్ లలో యాడ్ చేసుకోవాలి. ఎందుకనగా శరీరానికి ఎంతో శక్తిని అందజేస్తాయి అలాగే ఆకలి ఉండదు. అదే విధంగా డ్రై ఫ్రూట్స్ ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం, అలాగే ఉప్పు, కారాలు తినవద్దు అని చెప్తారు. కాబట్టి ఉపవాసం ఉండేవారు కచ్చితంగా బాదం, జీడిపప్పు, ఖర్జూరాలను నానబెట్టి తీసుకోవడం మంచిది. వీటి వలన మన శరీరానికి కావలసిన శక్తి అలాగే ఎన్నో పోషకాలు అందుతాయి. కాబట్టి పండ్లను, డ్రైఫ్రూట్స్ ని మీ డైట్ లో చేర్చుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.