Surya Bhagavan : ఆ రోజు సూర్య భగవానుడి ఇలా పూజిస్తే .. అదృష్టం మీ వెంటే ..!!
Surya Bhagavan : ఆదివారం రోజున సూర్యభగవానుడిని పూజిస్తే ఆరోగ్యం, ఆనందం శ్రేయస్సు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందువులు గణపతి, లక్ష్మీదేవి, శివుడు, విష్ణువు దేవతలందరితోపాటు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడిని కూడా పూజిస్తారు. సూర్య భగవానుడిని పూజిస్తే ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం, అదృష్టం కలుగుతాయి. సూర్య భగవానుడి ఆరాధించడం వలన ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అన్ని ఆనందాలను పొందగలుగుతాడని నమ్మకం. ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడు ఆదివారం రోజున ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య భగవానుడి అనుగ్రహం పొందాలంటే ఆదివారం రోజున కాకుండా ప్రతిరోజు సూర్యోదయం కాకముందే నిద్రలేచి స్నానం చేసి సాంప్రదాయ అనుసారంగా పూజించాలి. సూర్య భగవానుని దర్శనం చేసుకుని ప్రార్థించడం ద్వారా జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆదివారం సూర్యభగవానుడి ఆరాధించడం అత్యుత్తమం. తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేయాలి. శుభ్రమైన బట్టలు ధరించి, రాగి పాత్రలో నీరు తీసుకొని సూర్యునికి సమర్పించాలి. నీరున సమర్పించే రాగి పాత్రలో పసుపు, కుంకుమ,
అక్షింతలు, ఎరుపు రంగు పువ్వులు వేసి సూర్యుడికి సమర్పిస్తూ ఓం ఘృణి సూర్యాయ నమః అనే మహా మంత్రాన్ని జపించాలి. నీరును సమర్పించే సమయంలో ఆ నీళ్లు ఎవరి కాళ్ళ కిందకు వెళ్లకుండా ఒక వెడల్పాటి ప్లేట్ పెట్టి దాన్లో నీరు పడేలా సమర్పించాలి. తర్వాత ఆ నీటిని ఏదైనా చెట్టుకు పోయాలి. వీలైతే ఆ నీటిని మందారం చెట్టుకు సమర్పించాలి. సూర్య చాలిసాను ప్రత్యేకంగా ఆదివారం పటించాలి. సూర్య భగవానుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. సూర్య భగవానుడిని పూజించడం వలన శారీరక, మానసిక వ్యాధులు తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఆదివారం రోజున పేదవాళ్లకు గోధుమలు, బెల్లం దానం చేస్తే మంచిది.