Married Couples : వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే చాణక్యుడు చెప్పిన ఈ మాటలు వినాల్సిందే… తప్పక తెలుసుకోండి…!
Married Couples : నేటి కాలంలో వైవాహిత జీవితం సజావుగా సాగాలంటే నమ్మకం మరియు సమన్వయం తప్పకుండా ఉండాలి. ఒకవేళ ఇప్పటికే పెళ్లి చేసుకున్న వారు లేదా పెళ్లి చేసుకోబోయే వారు ముఖ్యంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అయితే వైవాహిక జీవితంలో కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయడం వంటివి జరుగుతాయి. వాటికి తగ్గ పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి వీటికి కారణం మీ స్వభావంలో ఉండే కొన్ని లోపాలు కావచ్చు. ఇవి మీ వైవాహిక జీవితం […]
ప్రధానాంశాలు:
Married Couples : వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే చాణక్యుడు చెప్పిన ఈ మాటలు వినాల్సిందే... తప్పక తెలుసుకోండి...!
Married Couples : నేటి కాలంలో వైవాహిత జీవితం సజావుగా సాగాలంటే నమ్మకం మరియు సమన్వయం తప్పకుండా ఉండాలి. ఒకవేళ ఇప్పటికే పెళ్లి చేసుకున్న వారు లేదా పెళ్లి చేసుకోబోయే వారు ముఖ్యంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అయితే వైవాహిక జీవితంలో కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయడం వంటివి జరుగుతాయి. వాటికి తగ్గ పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి వీటికి కారణం మీ స్వభావంలో ఉండే కొన్ని లోపాలు కావచ్చు. ఇవి మీ వైవాహిక జీవితం పై ప్రభావం చూపుతాయి. అటువంటి సమయంలో ఈ వైవాహిక జీవితం బలంగా ఉండాలంటే కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయి. అయితే వీటి గురించి చాణుక్యుడు తెలపడం జరిగింది. దీని ద్వారా మీ వైవాహిక జీవితం మెరుగుపడడంతో పాటు సంతోషంగా జీవిస్తారు. మరి ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Married Couples గోప్యత.
భార్య భర్తల మధ్య గోప్యత అనేది చాలా ముఖ్యం. భార్య భర్తల విషయాలను ఎప్పుడూ గోప్యంగా ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడవ వ్యక్తికి చొరవ ఇవ్వకూడదు. ఒకవేళ మీ విషయాలు మూడవ వ్యక్తికి తెలిస్తే మీ వైవాహిక జీవితం నాశనం అయినట్లే అలాగే భార్యాభర్తల మధ్య నమ్మకం కూడా పోతుంది. దీనివల్ల మీ మధ్య అపార్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది.
Married Couples అబద్ధం.
అబద్ధం అనే ఒక అలవాటు వలన భార్యాభర్తల మధ్య సంబంధం నాశనం అవుతుంది. అబద్దాలతో ఏర్పడిన సంబంధం ఎంతో కాలం నిలవదు. ఎందుకంటే ఆ సంబంధానికి ఎలాంటి ఆధారాలు ఉండవు. ఇలాంటి సంబంధాలు ఎప్పటికైనా విచ్ఛిన్నమవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులనైనా సరే అబద్దాలను ఆశ్రయించకపోవడం మంచిది. అబద్ధం అనేది విషం తో సమానం అని చాణిక్యుడు చెప్పాడు.
డబ్బు.
ఖర్చు విషయంలో భార్యాభర్తలు ఎప్పుడు స్పష్టంగా ఉండాలి. పూర్వకాలంలో స్త్రీ పురుషుల పాత్రలు భిన్నంగా ఉండేది. కాని ప్రస్తుతం పురుషులతో పాటు మహిళలు కూడా సంపాదిస్తున్నారు. కాబట్టి డబ్బుకు సంబంధించిన విషయాలలో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఖర్చు పొదుపు మరియు పెట్టుబడి ఇలాంటి విషయాలలో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకరి ఆర్థిక పరిస్థితిని మరొకరు తెలుసుకొని ఖర్చులను నివారించుకోవాలి. ఎందుకంటే సంపద విషయంలో భార్య భర్తల మధ్య వివాదం ఏర్పడే అవకాశాలు చాలా ఉంటాయి.
వ్యసనం.
వ్యసనాల కారణంగా మానవులు శారీరకంగా మానసికంగా సామాజికంగా బలహీన పడుతారు. మాదక ద్రవ్యాలు అలవాటు పడితే ఆ జీవితం నాశనం అవుతుంది. ఏదైనా వ్యసనాలకు అలవాటు పడితే అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టం. కాబట్టి అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. భార్య భర్తల మధ్య సంబంధం విచ్ఛిన్నం కావడానికి అతిపెద్ద కారణం మద్యం అని ఇటీవల ఓ సర్వేలో తేలింది.