Ashada Masam : ఆషాఢ మాసంలో కొత్త దంపతులు ఎందుకు దూరంగా ఉండాలి?
Ashada Masam : తెలుగు సంవత్సరాలు, మాసాలకు చాలా ప్రత్యేకత ఉంది. పన్నెండు మాసాల్లో ఒక్కో మాసం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ క్రమంలోనే నాలుగో మాసమైన ఆషాఢ మాసానికి మరింత ప్రాముఖ్యత ఉంది. అయితే ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఈ ఆషాడ మాసాన్నే శూన్య మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. అయితే ఈ ఆషాఢ మాసం ఎన్నో పూజలు వ్రతాలకు కూడా ప్రత్యేకం. అదే విధంగా కొత్తగా పెళ్లి అయిన జంటలు ఈ ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు. అమ్మాయిలందరూ అత్తారింటి నుంచి పుట్టింటికి చేరుకుంటారు. అసలు ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లైన వధూవరులు ఎందుకు దూరంగా ఉంటారో
మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఆషాడ మాసం మొత్తం అంటే నెల రోజుల పాటు పెళ్లైన అమ్మాయిలో అత్తారింట్లో ఉండుకుండా పుట్టింటికి వెళ్తారు. అత్త మొహం చూడకూడదని కూడా చెబుతుంటారు. ఆ క్రమంలోనే కొత్త జంట దూరంగా ఉండాలని కఠిన నిబంధనలను పెడ్తారు. అయితే నూతన వధూవరిలిద్దరూ ఆషాఢ మాసం అంతా… ఈ నిబంధనలను మొత్తం పాటిస్తారు. సాధారణంగా ఆషాఢ మాసంలో ఎక్కువగా వ్యవసాయ పనులు ఉంటాయి. ఈ వ్యవసాయ పనులలో ఉండగా కొత్త అల్లుడు ఇంటికి వస్తే వారికి మర్యాదలు చేయడం కుదరదు. కనుక పూర్వ కాలంలో పెద్దలు ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన జంట దూరంగా ఉండాలని చెప్పేవారు.అదేవిధంగా ఆషాడమాసంలో గర్భధారణ జరగడం అంత మంచిది కాదు.
ఈ మాసంలో గాలులు.. కలుషితమైన నీరు ఎక్కువగా ఉంటాయి కనుక వీటిని తీసుకుంటే ఎన్నో అనారోగ్యాల బారిన పడతారు. అందు కోసమే పెళ్లైన జంటలను దూరంగా ఉంచుతారు. ఒకవేళ మహిళ గర్భం దాల్చితే వచ్చే ఏడాది చైత్ర మాసంలోబిడ్డ పుడ్తుంది. చైత్ర మాసంలో విపరీతమైన ఎండలు ఉంటాయి. అయితే అంత ఎండలు పుట్టిన బిడ్డకుఅంత మంచిది కాదు. అందుకే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. అంతే కాకుండా ఈ మాసంలో అమ్మాయిలు, స్త్రీలు ఒక్కసారి అయినా గోరింటాకు పెట్టుకుంటారు. ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల అనేక రోగాల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చట. అందుకే ఈ మాసంలో గోరింటాకు కూడా పెట్టుకుంటూ ఉంటారు.