Home » Devotional » In 2025 Venus Throwing Bundles Of Money To These Zodiac Signs
Devotional

Zodiac Signs : 2025 లో ఈ రాశుల వారికి డబ్బు మూటలు విసురుతున్న శుక్రుడు…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: January 6, 2025, 8:57 pm
Advertisement

Zodiac Signs : 2025 వ సంవత్సరంలో విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మొదటిసారి శతబిషా నక్షత్రంలోకి జనవరి 4వ తేదీన ఉదయం 4:47 నిమిషాలకు ప్రవేశించాడు. ఇలా జనవరి 17వ తేదీ 7:51 నిమిషాల వరకు ఉండి ఆ తర్వాత పూర్వభద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా శుక్రుడు శుక్రుడి నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Advertisement

Zodiac Signs : 2025 లో ఈ రాశుల వారికి డబ్బు మూటలు విసురుతున్న శుక్రుడు…!

Zodiac Signs మేష రాశి

శుక్రుడి సంచారంతో మేష రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలను పొందుతారు. అయితే మేష రాశి జాతకుల వారికి సంపద స్థానంలో శుక్రుడు ఉన్నందున వీరికి ఆకస్మిత ఆర్థిక ధన లాభాలు మరియు శ్రేయస్సు లభిస్తాయి. ఇక వృత్తిపరంగా వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే సహ ఉద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు నూతన వాహనాలను మరియు గృహాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Advertisement

మిధున రాశి : శుక్రుడు శతభిషా నక్షత్రం లోకి ప్రవేశించడం వలన మిధున రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. అయితే మిధున రాశిలో శుక్రుడు తొమ్మిదో స్థానంలో ఉండడం వలన వీరు కొన్ని సానుకూల మార్పులను చూస్తారు. దీంతో వారి జీవితంలో విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా వృత్తి వ్యక్తిగతంగా మంచి పురోగతి ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగి బంధాలు బలపడతాయి. కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వలన లాభాలు చేకూరుతాయి.

వృశ్చిక రాశి: శతభిషా నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించటం వలన వృశ్చిక రాశి జాతకులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు నూతన వాహనాలను ఇల్లు ఆస్తులను కొనుగోలు చేస్తారు. శతభిషా నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడం వలన వృశ్చిక రాశి జాతకుల జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఇక వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపారంలో నూతన అవకాశాలు రావడంతో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి