Vruchika Rashi : జనవరి 2024 వృశ్చిక రాశి వారికి మరి కొద్ది రోజుల్లో షాకింగ్ మలుపులు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vruchika Rashi : జనవరి 2024 వృశ్చిక రాశి వారికి మరి కొద్ది రోజుల్లో షాకింగ్ మలుపులు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :9 December 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Vruchika Rashi : జనవరి 2024 వృశ్చిక రాశి వారికి మరి కొద్ది రోజుల్లో షాకింగ్ మలుపులు...!

Vruchika Rashi : ఈ ఒక్క జనవరి మాసంలో అసలు గ్రహస్థితి ఏవిధంగా ఉంటాయో చూద్దాం.. మేషరాశిలో గురువు అదేవిధంగా కన్యారాశిలో కేతువు యొక్క సంచారము వృశ్చికలలో శుక్రుడు, బుధుడు సంచరిస్తున్నాడు. ధనస్సులో రవి మరి కుజుడు మకరంలో శని భగవానుడు అదే విధంగా మీనంలో రాహు. సంచరిస్తున్నారు. అయితే
24వ సంవత్సరం ఈ నూతన సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వారు అలాగే జైస్టనక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. ఈ వృశ్చిక రాశి వారిని గనుక పరిశీలించినట్లయితే ఆదాయం 8 వ్యయం 14 గా ఉంటుంది. అలాగే రాజపూజ 4 అవమానం అయిదుగా ఉంటుంది.

అయితే ఈ వృశ్చిక రాశి వారికిఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆదాయం విషయంలో అయితే అద్భుతంగా ఉంది. వ్యయం కూడా శుభమూలత వ్యయం కనిపిస్తుంది. శుభ మూలకం అంటే ఇంటిలో శుభకార్యాలు చేయడం లేదా ఇల్లు స్థలాలు, వాహనాలు లాంటివి కొనుగోలు చేయడం ఆస్తులను కొనుగోలు చేయడం కూడా శుభమూలఖమైనటువంటివి.. అయితే ఈ వృశ్చిక రాశి వారు ఈ మాసంలో సహనంతో ఓపికగా ఉండండి. పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ధనం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రధానంగా ఒక్కసారిగా మీకు డబ్బులు వస్తున్న సందర్భంలో ఆపుకోవడం పొదుపు చేయడం అనేది కూడా నేర్చుకున్నట్లయితే.. మీరు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరమైతే కనిపించదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కు సంబంధించి వ్యాపారాలు చేస్తున్న సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

విద్యార్థులకు పూర్తి అనుకూల సమయం గురు బలం బాగుండడం వల్ల జ్ఞాపకశక్తి పెరిగితే అలాగే మంచి మార్కులు కూడా సాధిస్తూ ఉంటారు. చదువుపై శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా విదేశీ విద్యను అభ్యసించాలి. స్త్రీలకు ఒక ఆరోగ్య ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ఏ పని చేపట్టిన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అయితే ఇది వృశ్చిక రాశి వారికి శని ప్రభావం ఉండడం వలన నవగ్రహ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండండి. అలాగే శివాలయాన్ని దర్శించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పరిహారంగా ఉంటుంది…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది