Kanaka Durga Navaratri : కనకదుర్గగమ్మ తల్లి నవ అవతారాలు మీకు తెలుసా..?
Kanaka Durga Navaratri కనకదుర్గగమ్మ తల్లి తొమ్మిది అవతారాలతో భక్తులను అనుగ్రహిస్తుంది . ముగురమ్మలకు మూలపుటమ్మగా ,సమస్త విశ్వాన్ని నడిపించే ఆది శక్తి గా వినుతికెక్కిన దూర్గాదేవి నవరాత్రులల్లో సాక్షాత్కారిస్తుంది. ఈ రూపాల గూరించి వివరించినట్లు మార్కేండేయ పురాణంలోని దేవి కవచంలో….
ప్రథమం శైలిపుత్రీ చ ద్వీతియ బ్రహ్మచారిణి !
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి!
పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ!
సప్తమం కాలరాత్రీతి మహగౌరీతి చాష్టమమ్!
నవమం సీద్దిధాత్రీ చ నవదుర్గా: ప‌్రకీర్తితా: 8!!
Kanaka Durga Navaratri అని ప్రస్తావితం అయింది.నవదుర్గావతరాలూ ,వాటి విషిష్టతలు ఇవి :
శైలపుత్రీ : నవ దుర్గలో మొదటి అవతారం శైలిపుత్రీ , హిమవంతుని కూమార్తే .ఆమె వాహనం వృషభం. కుడిచేతిలో త్రిశూలం . ఎడమ చేతిలో కమలం ధరించి ఉంటుంది.
బ్మహచారిణి : పరమశివుణి భర్తగా పొందటానికి వేల సంవత్సరాలు తపస్సు చేసిన అమ్మవారు బ్రహ్మిచారిణిగా పూజలందుకుంటోంది.తపోదిక్ష చిహ్నాలుగా జపమాల .కమడలంతో ఆమే కనిపిస్తుంది.
చంద్రఘంట : శిరస్సున చంద్రుణ్ణి ధరించిన చల్లని తల్లి చంద్రఘంట .ఆమె వాహనం పులి .ఈ రూపంలో అమ్మవారిని సేవిస్తే భూత ప్రేత పిశాచాది . భయాలు తోలగిపోతాయని ప్రతీతి.
కూష్మాండం : చిరు దరహసంతో బ్రహ్మండాన్ని సృజించిన అమ్మ కూష్మాండ. ఆమెకు కూష్మాండ
(గుమ్మడికాయ) బలి అంటే ప్రితి కాబట్టి ఆపేరుతో ప్రసిద్ది చెందిందని పురానాలు చెబుతున్నాయి .ఆమె వాహనం పులి .
స్కందమాత : కూమారస్వామి . ఆయనకు తల్లి కాబట్టి పార్వతీదేవి స్కందమాత అయింది. ఒడిలో షణ్ముఖుడితో ఆమె ధర్శనం ఇస్తుంది. ఆమె సింహ వాహిని .
కాత్యాయని : పార్వతీదేవి తనకు కూమార్తేగా జన్మించాలని కాత్యాయన మహర్షి తపస్సు చేవాడు .ఆయన అభిష్టం నెరవేర్చిన అమ్మవారు కాత్యాయనిగా ప్రసిద్ధి చెందింది. ఆమె వాహనం సింహం.
కాళరాత్రి : గర్ధాభం ( గాడిద) వాహనంగా కలిగిన కాళరాత్రి అత్యంత భయంకర స్వరూపిణి .కానీ ఆమె సూభాలను ప్రసాధించే చల్లని తల్లి అని భక్తుల విశ్వాసం .
మహగౌరి : శివుడి అర్ధాంగి కావడానికి కఠోర తప్పస్సు చేసిన పార్వతి శరీరం నల్లగా మారిందంట !అందుకే అమ్మవారికి మహ గౌరి అనే పేరు వచ్చింది . ఆమె వాహనం ఎద్దు,అభయ ,వరద,ముద్రలతో ఆమె కరుణిస్తుందని భక్తుల విశ్వాసం .
సిద్ధి ధాత్రి : వివునికి సర్వ సిద్ధులనూ ప్రసాదించిన దేవత సిద్ధిధాత్రి అని దేవి పూరాణం చెబుతోంది .
కమలంపై పద్మాసనంలో కూర్చొనే ఈ అమ్మవారిని దర్శించిన దేవత సిద్ధి ధాత్రి అని దేవి పురాణం చెబుతుంది.కమలంపై పద్మాసనంలో కూర్చొనే ఈ అమ్మవారిని ధర్శించినంత మాత్రాన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు . ఆమె వాహనం సింహం .
శ్రీ శైలంలో నవదుర్గావతారాల్లో …..
విజవాడ ఇంద్రకీలాద్రిలో దేవి నవరాత్రుల సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి చేసే అలంకారాలు వేరు ….అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి . ద్వాదశ జోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి అయిన శ్రీశైల క్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భ్రమరాంభాదేవికి చేసే అలంకారాలు వేరు . ముగ్గురమ్మల ములపుటమ్మ దుర్గమ్మ నవరాత్రుల్లో దర్శనమిస్తుంది . శక్తి పీఠం కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అమ్మవారిని దేవి కవచంలోని ఆమెను సుత్తించే నవదుర్గల రూపాల్లోనే అలకరించడం సంప్రదాయంగా వస్తోంది .
నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దేవి కవచంలోని ఆమెను సుతించే నవదుర్గల రూపాల్లోనే అలంకరించడం సంప్రదాయంగా వస్తుంది . నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి శైల పుత్రి బ్రహ్మచారిణి ,చంద్రగంటా దేవి .కూష్మాండాదేవి, స్కంధమాత, కాత్యాయనీ దేవి ,కాళరాత్రి ,మహ గౌరి , సిద్ధి దాత్రి రూపాల్లో అలంకరణ చేస్తారు . ఉత్సవాల చివరిరోజు ఉదయం సిద్ధి ధాత్రిగా , సాయంత్రం నిజరూపంలో
భ్రమరాంబాదేవిగా భక్తులకు ధర్శనమిస్తారు . శ్రీశైలంలో నిర్వహంచే నవరాత్రి ఉత్సవాల్లో గ్రమోత్సవం
విశేషమైనది .అమ్మవారినీ , శ్రీ మల్లి కార్జున స్వామిని రోజుకో వాహనంపై ఆసీనులను చేసి .గ్రామ వీదుల్లో
ఊరేగిస్తారు . అయితే ఈ ఏడాది కరోనా నేపద్యంలో అమ్మవారి విశేషాలంకరణలు ,గ్రామోత్సవం ఆలయానికే పరిమితం .
రోజుకో తీరుగా : ( నేడు ఎంగిలి పూల బతుకమ్మ ):
తెలంగాణ గ్రామిన సంస్కృతికి అద్ధం పట్టే సంబురం ….బతుకమ్మ పండుగ .ఈ వేడుకలు ప్రతి యేటా భాద్రపద అమవాస్య అంటే మహలయ అమావాస్య ( పెతర మాసం ) నాడు ప్రాంభమవుతాయి .కాని ఈ ఏడాది ఆశ్వయుజమాసం అధికమాసం కాబట్టి అశ్వయుజ అమవాస్య (శుక్రవారం) మొదలవుతున్నాయి .
ఈ సంబురాల్లో బతుకమ్మలను రోసుకో పేరుతో పిలుస్తారు .మొదటి రోజున ఎంగిలిపూల బతుకమ్మ అలంకరనకోసం ముందురోజే రకరకాల పువ్వులు కోసుకొని తిసుకోచ్చి .నీళ్ళలో వేస్తారు .మర్నాడు వాటితో బతుకమ్మను అలంకరిస్తారు .అందుకే `ఎంగిలపూల బతుకమ్మ అంటారు .ఈ తోమ్మిది రోజులూ రకరకాల ప్రసాదాలను బతుకమ్మకు నివేదిస్తారు . ఈ రోజు నైవేద్యం గా నువ్వులు నూకలు లేదా బియ్యం ,బెల్లం నైవేద్యంగా పెడతారు .