Karthika Masam : కార్తీక మాసంలో ఈ దీపం పెడితే తాకట్టు పెట్టిన బంగారం మళ్లీ మీ సొంతం అవడం ఖాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Masam : కార్తీక మాసంలో ఈ దీపం పెడితే తాకట్టు పెట్టిన బంగారం మళ్లీ మీ సొంతం అవడం ఖాయం…!

Karthika Masam : మనలో చాలామంది బంగారం ఉంటుంది. కొందరు వాటిని శుభకార్యాలకు అలంకరించుకుంటూ ఉంటారు. మరికొందరి బంగారం మాత్రం పరిస్థితుల కారణంగా తాకట్టులో ఉంచవలసి వస్తుంది. నిత్యజీవితంలో అనేక రకాలైన సమస్యలకు వాటిని తాకట్టులో పెడుతుంటారు. కొందరైతే తాకట్టులో ఉన్న బంగారం వెంటనే తెచ్చుకుంటారు. కానీ కొంతమంది మాత్రం సంవత్సరాల తరబడి అలాగే ఉంచవలసి వస్తుంది. ఇలా తాకట్టు లోంచి బంగారం బయటికి రావడానికి ఎలాంటి సులభమైన పరిష్కార మార్గాలు పాటించాలో మనం తెలుసుకుందాం. ఏ […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 November 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Karthika Masam : కార్తీక మాసంలో ఈ దీపం పెడితే తాకట్టు పెట్టిన బంగారం మళ్లీ మీ సొంతం అవడం ఖాయం...!

  •  ఆదివారం రోజు పెసర అంత బంగారం పుట్టలో వేసి పుట్ట పూజ చేయండి

Karthika Masam : మనలో చాలామంది బంగారం ఉంటుంది. కొందరు వాటిని శుభకార్యాలకు అలంకరించుకుంటూ ఉంటారు. మరికొందరి బంగారం మాత్రం పరిస్థితుల కారణంగా తాకట్టులో ఉంచవలసి వస్తుంది. నిత్యజీవితంలో అనేక రకాలైన సమస్యలకు వాటిని తాకట్టులో పెడుతుంటారు. కొందరైతే తాకట్టులో ఉన్న బంగారం వెంటనే తెచ్చుకుంటారు. కానీ కొంతమంది మాత్రం సంవత్సరాల తరబడి అలాగే ఉంచవలసి వస్తుంది. ఇలా తాకట్టు లోంచి బంగారం బయటికి రావడానికి ఎలాంటి సులభమైన పరిష్కార మార్గాలు పాటించాలో మనం తెలుసుకుందాం. ఏ శుభకార్యమైనా మొదట బంగారమే దీనిని ఒక సెంటిమెంట్ గా కూడా చాలా మంది భావిస్తారు. అలాగే చాలామంది ఆర్థిక ప్రయోజనాల కోసం కూడా ఈ బంగారంపై ఆధారపడతాయి. అయితే ఎక్కువ రోజులు తాకట్టులో ఉన్నట్లయితే తాకట్టులో ఉన్న బంగారాన్ని తొందరగా విడిపించుకోవాలంటే మీకు వీలైనప్పుడు ఆదివారం రోజు పెసర అంత బంగారం పుట్టలో వేసి పుట్ట పూజ చేయండి.

ఎక్కువ అక్కర్లేదు.. పెసరంత వేస్తే చాలు. పుట్టలో పాలు పోసి పసుపు, కుంకుమ వేసి పెసర అంత బంగారాన్ని వేస్తే చాలు.. తాకట్టు లో ఉన్న బంగారం మీ సొంతమవుతుంది.. అలాగే ఈ రోజుల్లో అనేకమందికున్న ప్రధానమైన సమస్య రుణ బాధలు. రుణ బాధలు ఎక్కువగా ఉన్నవాళ్లు మంగళవారం రోజు ఒక శక్తివంతమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే మంగళవారం రోజు 27 మందార ఆకులు తీసుకోండి. గణపతి విగ్రహం లేదా ఫోటో దగ్గర ఉంచుతూ ఓం గణేశాయ ఈ మంత్రం చదువుతూ మందారాకులు సమర్పించండి. ఇలా తొమ్మిది మంగళవారాలు చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ మందారాకులు ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఈ శక్తివంతమైన పరిహారం పాటిస్తే అప్పుల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఇంటికి ధన ఆవాహన జరగాలంటే ఒక ఎర్రని వస్త్రంలో కొన్ని బియ్యాన్ని మూటకట్టి ఆ మూటని వంట గదిలో ఉంచండి. 21 రోజులు తర్వాత ఆ బియ్యంతో పాయసం చేసి మీ కుటుంబ సభ్యులందరూ తినాలి ఈ విధంగా చేసినట్లయితే మీ ఇంటికి ధన ఆవాహన జరుగుతుంది. అలాగే మర్రిచెట్టు దగ్గర దీపం వెలిగించి నైవేద్యం సమర్పించాలి.

మీరు ఈ పరిహారంతో మళ్లీ తాకట్టు పెట్టవలసిన అవసరం లేకుండా బంగారం మీ దగ్గరే ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే ఎవరైనా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు దానిని ఉప్పు నీటిలో కడిగి మీ బీరువాలో ఉంచాలి. ఈ విధంగా చేసినట్లయితే మీ బంగారం మళ్లీ తాకట్టు పెట్టవలసిన అవసరం రాదు. దుకాణాల్లో కొన్న నగలు కొన్ని సందర్భాల్లో చనిపోయిన వారివి అలాగే దొంగతనం చేసి అమ్మిన వారివి కూడా కావచ్చు. అలాంటి బంగారు నగలు మనం కొనుగోలు చేస్తూ ఉంటాం. మనకు తెలియని ఎన్నో దోషాలు దాగి ఉంటాయి బంగారు యోగం కలగాలంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇలాంటి నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మనం బంగారం కొన్నప్పుడు ఇంటికి వచ్చి వెంటనే బీరువాలు పెట్టకూడదు. బంగారాన్ని కొన్న తర్వాత పన్నీరుతో శుభ్రం చేసి ఆ బంగారాన్ని దేవుడు సన్నిధిలో ఉంచిన తర్వాత మీరు బీరువాలో పెట్టాలి. లేదా మీరు అలంకరించుకోవాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది