Karthika Masam : ఈ కార్తీకమాసంలో తులసి చెట్టు ఉన్న ప్రతి వారు ఈ పని తప్పక చేయాలి…!
Karthika Masam : హిందు మతంలో తులసి చెట్టుకు విశిష్టమైన స్థానం ఉంది. తులసి మొక్క హిందువుల ఇళ్లలో రోజు పూజలు అందుకుంటుంది. మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం. మరి తులసి ప్రాముఖ్యత గొప్పతనం గురించి ఇచ్చిన గొప్ప వరాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం..తులసి మొక్కకు రోజు నీళ్లు పోయాలి. ప్రదక్షిణాలు చేయాలి. తులసి మొక్కకు నమస్కరించాలి. దీని వల్ల ఆశుభాలు తొలగి శుభాలు కలుగుతాయి. తులసి మనం ఉన్న […]
ప్రధానాంశాలు:
Karthika Masam : ఈ కార్తీకమాసంలో తులసి చెట్టు ఉన్న ప్రతి వారు ఈ పని తప్పక చేయాలి...!

Karthika Masam : హిందు మతంలో తులసి చెట్టుకు విశిష్టమైన స్థానం ఉంది. తులసి మొక్క హిందువుల ఇళ్లలో రోజు పూజలు అందుకుంటుంది. మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం. మరి తులసి ప్రాముఖ్యత గొప్పతనం గురించి ఇచ్చిన గొప్ప వరాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం..తులసి మొక్కకు రోజు నీళ్లు పోయాలి. ప్రదక్షిణాలు చేయాలి. తులసి మొక్కకు నమస్కరించాలి. దీని వల్ల ఆశుభాలు తొలగి శుభాలు కలుగుతాయి. తులసి మనం ఉన్న గృహం పుణ్యక్షేత్రంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయం, సాయంత్రం తులసి కోటవద్ద దీపారాధన చేయడం అత్యంత శుభకరం.
తులసి చెట్టు మన ఇంటి ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించవు..వివాహం కాని మహిళలు పూజలు చేయడం వలన వివాహం జరుగుతుంది.ఎక్కడైతే వైష్ణవులు నివాసం ఉంటారో అక్కడ సాక్షాత్తు శ్రీ మహా విష్ణువుంటారు అని పద్మపురాణంలో ఉంది. తులసి మొక్క విశిష్టత గురించి ఆయుర్వేదంలో వివరించారు. ప్రతిరోజు ఉదయం అభ్యంగ స్నానం ఆచరించి స్త్రీలు తులసి మొక్కను పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం తెలుగింటి ఆచారం. ప్రతి ఇంట్లో తులసి ఉంటే అక్కడ శ్రీ లక్ష్మీ సౌభాగ్య సమకూర గలరు. అందుకే తులసికోట చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. తులసి దళాలు వివిధ దేవతలకు అర్చనకు ఉపయోగిస్తారు.
తులసి ఉన్న ప్రదేశంలో సమస్త దేవతలు పుణ్యతీర్దాలు కొలువై ఉంటాయి. తులసి పత్రం యొక్క స్పష్టగలిగిన జలల్లో స్నానం చేసిన వారు సర్వ తీర్థాలను స్నానం చేసిన వారు సమస్త యజ్ఞాలకు దీక్ష వహించిన వారు శ్రీహరికి ఎన్నోవేల అమృత వాండాలు సమర్పించిన తృప్తి ఒక తులసీదళం సమర్పిస్తే కలుగుతుంది. ఎవరైతే మరణించే సమయంలో తులసి జలం సేవిస్తే వారి సమస్త పాపకర్మల నుంచి విముక్తి పొంది కృష్ణ లోకం చేరుతారు. ఏ మనుషుడు నిత్యం భక్తి పూర్వకంగా తులసి తీర్థం స్వీకరిస్తారో వారికి గంగా స్నానఫలం లభిస్తుంది. అతను తప్పకుండా జీవన్ముక్తుడు కాగలడు..