Lakshmi Devi : మీ ఇంట్లో ఈ రెండు ఉంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది
Lakshmi Devi : దరిద్ర దేవత… సకల కష్టాలకు కారణం. దారిద్య్రం పోతే సుఖాల సంగతి పక్కనబెట్టినా మనఃశాంతితో బతుకవచ్చ. సకల ఇబ్బందులకు కారణం దారిద్య్రం. కాబట్టి ఆ దారిద్య్ర దేవత పోతే మనకు అన్ని ఉన్నట్లే. అది పోవడానికి మనిషి శ్రమ తప్పనిసరి. దీనితోపాటు కొంత భగవత్ అనుగ్రహం కావాలి. దీనికోసం మన పూర్వీకులు అనేక పరిహారాలు పేర్కొన్నారు. వాటిలో చాలా సులువైనది, లక్ష్మీ అనుగ్రహం పొందే పరిహారం గురించి తెలుసుకుందాం…
Lakshmi Devi : ఆవుపిడక పరిహారం
ఒక ఆవు పిడక ఇంట్లో ఉండడం వల్ల దరిద్ర దేవత పోయి లక్ష్మీదేవి Lakshmi Devi ఆవాహనం అవుతుంది. అది ఎట్లా అంటే గోశాల కు వెళ్లి ఆవు పేడను తెచ్చి దానిని పేపర్ మీద ఫిడకగా వేసి ఎండలో పెట్టి ఎండిన తర్వాత ఆ పేపర్ తీసివేసి పిడకలను తీసుకొండి. ఆ పిడక మీద పసుపుతో నక్షత్రం ముగ్గు అంటే షట్కోణం ముగ్గు వేసి ఆ ముగ్గు ఆరు మూలల మధ్యలో కుంకుమ పెట్టాలి. మధ్యలో వేప ఆకులు పెట్టి ఆ ఆకు మీద పసుపుతో గౌరమ్మను చేసి దానికి పైన బొట్టు పెడితే అది హరిద్ర గణపతి అవుతుంది, అదే పసుపు గణపతికి పైన బొట్టు కాకుండా చుట్టూ కుంకుమ బొట్టు పెట్టడం వల్ల హరిద్ర గౌరీ అమ్మవారు అవుతుంది. గౌరమ్మ అంటే ఏదో కాదు గణపతిగానే భావించండి. ఆ అమ్మ రూపాలే అన్ని.
గౌరమ్మ గణపతి
గౌరమ్మ గణపతి దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే.. పసుపును తీసుకొని దానిలో నీళ్ల చుక్కలు వేసి పొడవుగా చేయాలి. అదే గౌరమ్మ. ఆ గౌరమ్మను పిడక యొక్క వేపాకు మధ్యలో స్థాపన చేయాలి. చేసి దానిని దేవుని దగ్గర పెట్టి రోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలతో సూర్యోదయం వరకే దీపం పెట్టినట్లయితే లక్ష్మీదేవి మీ గృహంలోకి ఆవాహనం అవుతుంది, దరిద్ర లక్ష్మి వెళ్ళిపోతుంది, ఇది ఒక రహస్యమైన తంత్రం, గగోశాల కు వెళ్ళినప్పుడు అక్కడ గోశాల వారికి ఇరవై ఒక్క రూపాయి ఇచ్చి పిడికెడు పేడను తెచ్చుకోండి. ఉచితంగా తెచ్చుకుంటే ఫలితం రాదు. ఈ పనిని శ్రద్ధతో, భక్తితో, విశ్వాసంతో చేసి చూడండి. అనతి కాలంలోనే అంటే తక్కువ కాలంలోనే మీ దారిద్య్ర బాధలు పోతాయి. నమ్మకంతో ఆచరించండి. ఈ తంత్రం పూర్వకాలంలో బాగా ఆచరించే వారు. చాలా సులభమైనది, శ్రీఘ్రంగా అనుగ్రహించే తంత్రం ఇది.