Vastu Tips : మీ ఇంట్లో మనశ్శాంతి కరువైందా..? ఈ వాస్తు దోశాలు ఏమైనా ఉన్నాయో చూసుకోండి!
Vastu Tips : ఇండియాలో చాలా మంది వస్తు దోషాలు, జాతక చక్రాలను నమ్ముతుంటారు. కొందరు వీటిని మూఢ నమ్మకాలుగా పరిగణించినా వారు మాత్రం తాము చేసేది చేస్తూ వెళ్తుంటారు. ఇంట్లో వాస్తు పరంగా ఏదైనా లోపం ఉందంటే ఆర్థికంగా, శారీరకంగానే కాకుండా దంపతుల మధ్య కొన్నిసార్లు గొడవలు ఎక్కువ జరుగుతాయని కొందరు నమ్ముతుంటారు. ఒక్కొక్కసారి విడిపోయేంత వరకు ఆ గొడవలు చోటుచేసుకుంటాయి. అందుకనే వాస్తు దోషాలు ఉంటే వాటిని సరిచేసుకోవడం ముఖ్యం. అటువంటి కొన్ని వాస్తు దోషాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే, వాస్తు దోషాలను ఎవరైతే బలంగా నమ్ముతుంటారో వారి కోసమే ఈ స్టోరీ..ఇంట్లో బల్బులు లేదా దీపాలు కూడా వాస్తు ప్రకారం ఉండాలి.
లేదంటే అ శుభంగా పరిగణించబడుతుంది. ఇంటి మూలల్లో చీకటిగా ఉంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, కలహాలు ఏర్పడతాయని అంటున్నారు. ముఖ్యంగా అత్తాకోడళ్ల మధ్య తరుచూ గొడవలు చోటుచేసుకునే ప్రమాదం పొంచి ఉన్నది. ఇంట్లో ఉన్న పూజ గది రకాల సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అందుకనే పూజ గదికి సంబంధించి వాస్తు దోషం ఉండటం శ్రేయస్కరం కాదంట.. వాస్తు ప్రకారం, విగ్రహాలను ఎప్పుడూ ఒకదానికి ఒకటి ఎదురెదురుగా పెట్టకూడదు. ఇలా దేవుడి విగ్రహాలు ఉంటే కుటుంబ సభ్యుల మధ్య తరచుగా విబేధాలు వస్తాయి. గొడవలకు కారణమై విడిపోయేంత వరకు వెళ్తుంది. మీ పూజ గదిలో కనుక విగ్రహాలు ఇలాగే ఉంటే ఈరోజే మార్పులు చేయండి.చీపురు ఇంటిని శుభ్రం చేస్తుంది. పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో సంపదకు రూపమైన లక్ష్మీ దేవి కొలువుదీరుతుంది.
Vastu Tips : మీ ఇంట్లో ఇలాంటివి ఉంటే వెంటనే సరిదిద్దుకోండి
దీనిని ఉంచి స్థలం సరిగా లేకపోతే కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. చీపురు ఇంట్లో జనం కంట పడని చోట ఉంచాలని అంటారు. అలాగే పొరపాటున కూడా చీపురు వంటగదిలో పెట్టకూడదు. ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.ఇంట్లో ఎక్కడైనా నీరు కారుతున్న సమస్య ఉంటే ఇది పెద్ద వాస్తు దోషమని చెబుతున్నారు. నీరు కారడం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని నమ్మకం. కనుక ఎక్కడ నుంచి అయినా నీరు కారు తుంటే వెంటనే రిపేర్ చేయించండి. రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.