Chanakyaniti : జీవితంలో ఈ 4 విషయాలలో అస్సలు సిగ్గు పడకండి… చాణక్యుడి నీతి ఏం చెబుతుందంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakyaniti : జీవితంలో ఈ 4 విషయాలలో అస్సలు సిగ్గు పడకండి… చాణక్యుడి నీతి ఏం చెబుతుందంటే…!

 Authored By ramu | The Telugu News | Updated on :23 September 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Chanakyaniti : జీవితంలో ఈ 4 విషయాలలో అస్సలు సిగ్గు పడకండి... చాణక్యుడి నీతి ఏం చెబుతుందంటే...!

Chanakyaniti : ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వం ప్రకారం జీవితాన్ని గడుపుతారు. తన జీవితంలో చిన్న పెద్ద నిర్ణయాలను కూడా తానే స్వయంగా తీసుకుంటాడు. అయితే కొంతమంది ఏం తినాలి ,ఏ దుస్తులను ధరించాలి,ఎలా జీవించాలి అనే విషయాల పై పెద్దల సలహాలను తీసుకుంటారు. మానవ జన్మ ఎత్తడం ఒక గొప్ప వరం.. దానిని పరిపూర్ణంగా జీవించాలని అంటారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎట్టి పరిస్థితులోను వెనకడుగు వేయకూడదు. కానీ కొంతమంది సిగ్గు కారణంగా ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు. సిగ్గు కారణంగా కొంతమంది కొన్ని ముఖ్యమైన పనులను చేయకపోవడం వలన జీవితంలో ఆ లోటు అనేది ఎప్పటికీ ఉండిపోతుంది. అయితే చాణిక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి కొన్ని ప్రదేశాలలో వెనకడుగు వెయ్యకూడదని చెప్పాడు. ఒకవేళ ఈ 4 ప్రదేశాలలో సిగ్గు పడితే జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి అవెంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Chanakyaniti విద్య పొందడానికి సిగ్గుపడకూడదు

ఒక వ్యక్తి జీవితంలో విద్య అనేది చాలా ముఖ్యం. ఏ ప్రదేశంలో ఎక్కడ చదువుకుంటున్న అందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అయితే ప్రతి వ్యక్తి ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు. ఎదుటి వ్యక్తిని పోల్చుకుంటూ నీకంటే తక్కువ అని అనుకుంటే చదువుకి అర్థమే ఉండదు. చాణిక్యుడు ఇది మంచి విషయంగా పరిగణించలేదు. విద్యను ఎక్కడ నుండి అభ్యసించిన దానిని అందుకోగలగాలి. ఒకవేళ అది జంతువైన లేదా మరి ఏదైనా కూడా విద్యను అందుకోవాలి. ఒకవేళ అర్థం కాని విషయాలు ఉంటే అది ఇతరులను అడిగి తెలుసుకోవాలి. దానిని విమర్శిస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి అన్ని వైపులా విజ్ఞానాన్ని అందుకోవడం చాలా ముఖ్యం.

Chanakyaniti తినడానికి సిగ్గు పడకూడదు.

జీవితంలో ఆహారం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. అలాంటి ఆహారాన్ని తినకుండా ఉంటే మీరే సమస్యలను తెచ్చుకున్నట్లు అవుతుంది. ఆకలితో ఉన్న వ్యక్తి తనపై తను నియంత్రణ కలిగి ఉంటారు. ఇలాంటివారు జీవితంలో వెనకడుగులు వేస్తారు. ఎందుకంటే ఆకలితో ఉన్నవారు ఆలోచించే విధానం, అర్థం చేసుకునే సామర్థ్యం తక్కువ ఉంటుంది. కనుక ఆహార విషయంలో సిగ్గు పడకూడదు. ముఖ్యంగా ఆకలిని ఎప్పుడూ చంపుకోకూడదు. ఎప్పుడు సంపూర్ణ భోజనం చెయ్యాలి.

Chanakyaniti జీవితంలో ఈ 4 విషయాలలో అస్సలు సిగ్గు పడకండి చాణక్యుడి నీతి ఏం చెబుతుందంటే

Chanakyaniti : జీవితంలో ఈ 4 విషయాలలో అస్సలు సిగ్గు పడకండి… చాణక్యుడి నీతి ఏం చెబుతుందంటే…!

Chanakyaniti అభిప్రాయాలను వ్యక్తపరచడంలో సిగ్గుపడకూడదు.

కొంతమంది జీవితంలో కొన్ని విషయాలను చెప్పడానికి సిగ్గుపడతారు. ఇలా తన మనసులో ఉన్న విషయాలను మరొకరికి చెప్పలేక ఇబ్బంది పడతారు. కాబట్టి ఎదుటి వ్యక్తికి తన మనసులోని విషయాలను చెప్పడం అనేది చాలా ముఖ్యం. ఇది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అయితే తన మనసులో ఉన్న విషయాలను చెప్పకపోవడం వలన మనిషి పశ్చాత్తాపానికి గురి కావాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి చర్యల వలన సంబంధాలు బలహీనపడతాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే తన మనసులోని మాటను సిగ్గుపడకుండా ధైర్యంగా చెప్పాలి.

Chanakyaniti అప్పు అడగడంలో సిగ్గు పడవద్దు.

ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరైనా సరే సిగ్గు పడకూడదు. డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అయితే ఎవరైనా మీ దగ్గర డబ్బుని అప్పుగా తీసుకుని దానిని తిరిగి ఇవ్వకపోతే మీరు నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే ఎలాంటి సంకోచం లేకుండా తిరిగి మీ అప్పుని అడగాలని చాణిక్యుడు తెలియజేశాడు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది