Makara Sankranti : మకర సంక్రాంతి రోజున దానం, స్నానం చేయు సమయం… సూర్యోదయానికి ముందా లేదా తర్వాత…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

 Makara Sankranti : మకర సంక్రాంతి రోజున దానం, స్నానం చేయు సమయం… సూర్యోదయానికి ముందా లేదా తర్వాత…?

 Authored By aruna | The Telugu News | Updated on :7 January 2025,9:10 pm

ప్రధానాంశాలు:

  •   Makara sankranti : మకర సంక్రాంతి రోజున దానం, స్నానం చేయు సమయం... సూర్యోదయానికి ముందా లేదా తర్వాత...?

Makara sankranti : సనాతన సాంప్రదాయాలలో హిందూ సాంప్రదాయం ఒకటి. అటువంటి సాంప్రదాయంలో కొన్ని పండుగలు హిందువులు సాంప్రదాయంగా చేసుకుంటారు. ఇటువంటి పండుగలు ఒకటైనది మకర సంక్రాంతి. మకర సంక్రాంతి నాడు సూర్యుడు ఉత్తరం వైపు కదులుతాడు. దీంతో ఉత్తరాయన కాలం మొదలవుతుంది. అయితే ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానం చేయడం దానం చేయడం వంటివి చేస్తే పుణ్య ఫలితాలు లభిస్తాయి. అటువంటి పరిస్థితులలో… మకర సంక్రాంతి రోజున ఏ సమయంలో స్నానం, దానం చేయడానికి అనుకూలమైన సమయము తెలుసుకుందాం …హిందూమతంలో మకర సంక్రాంతికి చాలా ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు ధనస్సు రాశిని విడిచిపెట్టి మకర రాశిలోనికి ప్రవేశించే రోజున మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో ఈ పండుగను సాంప్రదాయంగా,ఉత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈ రోజున పుణ్యం నదులలో స్థానం ఆచరించి శక్తి కొలది దానాలు ఇస్తారు. మకర సంక్రాంతి నాడు హిందూ విశ్వాసాల ప్రకారం ఈరోజు నా దానంతో పాటు పవిత్ర నదుల్లో స్నానం చేయటం వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి…

Makara Sankranti మకర సంక్రాంతి రోజున దానం స్నానం చేయు సమయం సూర్యోదయానికి ముందా లేదా తర్వాత

Makara Sankranti : మకర సంక్రాంతి రోజున దానం, స్నానం చేయు సమయం… సూర్యోదయానికి ముందా లేదా తర్వాత…?

Makara sankranti :ఈ సంవత్సరం మకర సంక్రాంతి ఎప్పుడు

సూర్య భగవానుడు మకర రాశిలోకి అడుగుపెట్టిన తరుణం నుంచి ఉత్తరాయన కాలం మొదలవుతుంది. అయితే ఈ మకర సంక్రాంతి నాడు ఎవరైతే దానం, స్నానం ఆచరిస్తారో వారికి పుణ్యఫలం లభిస్తుంది అని వేద పండితులు తెలియజేశారు. అయితే ఈ మకర సంక్రాంతి నాడు ఏ సమయంలో దానాలు, స్నానాలు ఆచరించాలో తెలుసుకుందాం.. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి 14వ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈరోజు నా మకర సంక్రాంతిని జరుపుకుంటారు ప్రజలు.

స్థానమాచరించుటకు, దానధర్మాలకు అనుకూలమైన సమయం ఎప్పుడు :

మనం విశేషంగా మకర సంక్రాంతి నాడు పూజలు, స్నానాలు, దానధర్మాలు వంటివి చేయటం పవిత్రమైన సాంప్రదాయంగా పరిగణించబడుతుంది. అయితే ఈ మకర సంక్రాంతి నాడు ఇవన్నీ చేయాలంటే ఒక శుభ సమయం మాత్రమే చూసి చేస్తారు. వంటి సమయం జనవరి 14న ఉదయం 9.03 గంటలకు పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ పుణ్యకాలం ఉదయం 9.03 మంచి మొదలయ్యి సాయంత్రం5.46 గంటల వరకు ఉంటుంది. అయితే ఈ రోజు మహా పుణ్యకాలం 45 నిమిషాల సమయం ఉంటుంది. సంక్రాంతి నాడు స్నానం, దానధర్మాలు చేయటానికి మంచి సమయం ఉన్నప్పటికీ… మహా పుణ్యకాలంలో దానధర్మాలు, స్నానం ఆచరించటం అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి.

మకర సంక్రాంతి ప్రాముఖ్యత :

మకర సంక్రాంతి అనేది హిందూ ధర్మం ప్రకారం మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరం వైపు తిరుగుతాడు కాబట్టి దాన్ని ఉత్తరాయనమని అంటారు. ఆరోజు ప్రత్యేకంగా సూర్యభగవానిని పూజించే సాంప్రదాయం ఉంది. ఆ రోజున సూర్యునితో పాటు విష్ణువును కూడా పూజిస్తారు. మకర సంక్రాంతి నాడు నువ్వులతో చేసిన వంటకాలు,రకరకాల వంటకాలు, పాలు బియ్యంతో చేసిన పరమాన్నం వంటివి చేసేవి సాంప్రదాయంగా వస్తుంది. ఈరోజు నా నువ్వులను దానం చేయటం శుభప్రదంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున నువ్వులను దానం చేసి…. పాయసం సూర్యునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల సూర్యుడు, మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని భక్తుల యొక్క ప్రగాడ విశ్వాసం..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది