Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రతం చేయడానికి శుభ సమయం ఇదే… పూజ తిది ఎప్పుడంటే…
ప్రధానాంశాలు:
Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రతం చేయడానికి శుభ సమయం ఇదే... పూజ తిది ఎప్పుడంటే...
Varalakshmi Vratam : శ్రావణ మాసం పౌర్ణమి తిది కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఆ రోజు అనేది లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేసినప్పటికి లక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారం రోజు ఆరాధించడం చాలా ముఖ్యమని హిందువులు భావిస్తారు. కాబట్టి వరలక్ష్మీ వ్రతానికి హిందూ మతంలో ప్రాముఖ్యత చోటు చేసుకుంది. అయితే భారతదేశంలో ఎక్కువగా వరలక్ష్మీవ్రతాన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు , సిరిసంపదలు , సంతానం ఉజ్వల భవిష్యత్తు, మహిళల దీర్ఘాయుష్ మరియు సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మివ్రతాన్ని ప్రతి ఒక్క స్త్రీ ఆచరిస్తుంది.
Varalakshmi Vratam వరలక్ష్మీ వ్రతం 2024 ఎప్పుడంటే..
వరలక్ష్మీ వ్రతాన్ని పౌర్ణమి తిధి కి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆగస్ట్ 16, 2024 శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ
వ్రతం 2024 శుభ ముహూర్తం సింహ లగ్న పూజ ముహూర్తం ఉదయం – 05:57 am – 08:14 am లోపు జరుపుకోవాలి.
వృశ్చిక రాశి పూజ ముహూర్తం (మధ్యాహ్నం) – 12:50 PM – 03:08 PM
.కుంభ లగ్న పూజ ముహూర్తం (సాయంత్రం) – 06:55 PM – 08:22 PM
వృషభ లగ్న పూజ ముహూర్తం (అర్ధరాత్రి) – 11:22 pm – 01:18 pm, ఆగస్టు 17 లోపు జరుపుకోవచ్చు.
వరలక్ష్మీ వ్రతం పూజ తిధి..
వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామున నిద్రలేచి దినచర్యని ముగించుకోవాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేయాలి. ఇంటి ముందు ముగ్గులు వేసిన తరువాత ఇంట్లోని పూజా గది మరియు వ్రతం చేసుకుని పూజా స్థలాన్ని శుభ్రం చూసుకోవాలి. ఆ ప్రదేశంలో గంగాజలాన్ని చల్లి శుద్ధి చేసి తల్లి వరలక్ష్మి దేవిని స్మరిస్తూ ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసుకోవాలి. అనంతరం ఒక చెక్క పీట పై శుభ్రమైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి. దానిపై లక్ష్మీదేవి మరియు గణపతిల విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ప్రతిష్టించండి. లక్ష్మిదేవి దగ్గర బియ్యం వేసి దానిపై నీటితో నింపిన కలశాన్ని ప్రతిష్టించండి.
తర్వాత గణేశుడు లక్ష్మి విగ్రహాల ముందు నెయ్యితో దీపారధన చేసి అగరబత్తిలను వెలిగించాలి. ముందుగా గణపతికి పూజ చెసి పూలు, దర్భ, చందనం,కొబ్బరికాయ పసుపు, కుంకుమ, అక్షతలు, పూలమాల మొదలైన వాటిని సమర్పించండి. అనంతరం వరలక్ష్మీ దేవి పూజని ప్రారంభించాలి. అమ్మవారికి పదహారు అలంకారాలతో పాటు పసుపు, కుంకుమ, అక్షతలు, పూలమాలను సమర్పించిన తరువాత అమ్మవారికి పులిహోరం, పాయసం, శనగలు, చలిమిడి, వడపప్పు, బూరెలు వంటి ఆహారపదార్ధాలను తొమ్మిది లేదా ఐదు రకాల ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పించండి. తరువాత అమ్మవారి అష్టోత్తరశతనామావళి మంత్రాలతో పూజ మొదలు పెట్టండి. పూజ సమయంలో వరలక్ష్మీ వ్రత కథను పఠించండి. చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి పూజ ముగించాలి. ఆ తర్వాత అందరికీ ప్రసాదం ఇవ్వాలి. ముత్తైదువులకు పసుపు కుంకుమ శనగలు తాంబూలం పెట్టి వాయినం అందించండి.