Rakhi Festival : రాఖీ ఏ టైంలో కట్టుకోవాలి .. ఆ టైం దాటాక కడితే ప్రాణగండం ..
Rakhi Festival : తెలుగు రాష్ట్రాలలో రాఖీ పండుగ పై సందిగ్ధత నెలకొంది. ఈ పండుగ బుధవారం జరుపుకోవాలా లేదా గురువారం జరుపుకోవాలనే దానిపై చర్చ నడుస్తుంది. సాధారణంగా రాఖీ పండుగను శ్రావణమాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం రావడంతో రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలని కన్ఫ్యూజన్ గా ఉంది. అయితే పౌర్ణమి గడియల్లోనే సోదరుడికి రాఖీ కట్టాలని పురోహితులు చెబుతున్నారు. పౌర్ణమి బుధవారం ఉందా లేక గురువారం ఉందా అనేదానిపై ఒక్కొక్కరు ఒక్కో తీరుగా సమాధానం చెబుతున్నారు. ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజుల్లో వచ్చినట్లు పురోహితులు చెబుతున్నారు.
దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆగస్టు 30,31న రాఖీ పండుగను చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ పండుగను ఆగస్టు 30,31 రెండు రోజులు జరుపు కోవచ్చట. 30న పౌర్ణమి ఘడియలు ఉన్నప్పటికీ రాత్రి తొమ్మిది గంటలకు భద్రకాలం ఉందనే పురోహితులు చెబుతున్నారు. భద్రకాలంలో రాఖీని అస్సలు కట్టకూడదని పురోహితులు చెబుతున్నారు. అలా కడితే దోషమని హెచ్చరిస్తున్నారు. భద్రకాల ప్రభావం సోదరులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే 30న రాత్రి 9:02 నుంచి 31 వ తారీకు ఉదయం 7:05 వరకు సోదరులకు రాఖీ కట్టవచ్చని చెబుతున్నారు .
అక్కచెల్లెలు ఈ సమయంలో తమ సోదరులకు ఎప్పుడైనా రాఖీ కట్టవచ్చను చెబుతున్నారు. ఈ సమయంలోనే సోదరులకు రాఖీ కడితే మేలు జరుగుతుందట. పొరపాటున భద్రకాలంలో సోదరుడికి రాఖీ కడితే అనేక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆగస్టు 31న రాఖీలు కట్టేందుకు శుభసమయాలు కూడా ఉన్నాయి. ఉదయం 5:58 నుంచి 7:34 నిమిషాల వరకు రాఖీ కట్టవచ్చని చెబుతున్నారు. మధ్యాహ్నం 12:21 నుంచి 3:32 నిమిషాల లోపు సాయంత్రం 5:08 నుంచి 8:08 నిమిషాల వరకు రాఖీ కట్టవచ్చని చెబుతున్నారు.