Rakhi Purnima : రాఖీ పండుగ రోజు ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కడితే మంచిది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rakhi Purnima : రాఖీ పండుగ రోజు ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కడితే మంచిది…!

 Authored By ramu | The Telugu News | Updated on :18 August 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Rakhi Purnima : రాఖీ పండుగ రోజు ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కడితే మంచిది...!

Rakhi Purnima : శ్రావణమాసపు పున్నమి వెన్నెల అన్నాచెల్లెల అనురాగానికి రక్షణ బంధానికిి ప్రతీకగా అయిన రాఖీ పండుగ మరోసారి మన ముంగిట నిలిచింది. ఈ ఏడాది ఆగస్టు 19 శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగ మన సంప్రదాయాలకు విలువలకు అద్దం పడుతుంది. ఈ పవిత్రమైన రోజున కేవలం రాఖీ కట్టుకోవడమే కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశుల వారీగా సరైన రంగు రాఖీలు ఎంచుకోవడం కూడా శుభప్రదం అని నమ్ముతారు. ఈ రంగులు జాతకంలోని గ్రహాలను బలపరిచి వ్యక్తి జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతాయని చెబుతారు. మరి ఏ రాశి వారికి ఏ రంగు రాఖి అనుకూలము ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Rakhi Purnima మేషరాశి…

మేష రాశి వారికి ఎరుపు రంగు రాఖి శక్తిని ఉత్సాహాన్ని ఇస్తుంది. వారిలోని నాయకత్వ లక్షణాలను ధైర్యాన్ని పెంపొందించి కుజుడుని బలపరుస్తుంది. ఇది మేష రాశి వారి సహజ లక్షణాలకు అనుగుణంగా ఉంటుంది. వారి జీవితంలో ఉత్సాహం ధైర్యం నిండి ఉండాలని కోరుకుంటూ సోదరీమణులు ఎరుపు రంగు రాఖీని కట్టడం శుభప్రదం.

వృషభ రాశి…

వృషభ రాశి వారికి తెలుపు రంగు రాఖీ ప్రశాంతతను సౌభాగ్యాన్ని తెస్తుంది. ఇది శుక్ర గ్రహ శక్తిని పెంచుతుంది. తెలుపు రంగు స్వచ్ఛతను సూచిస్తుంది. ఇది వృషభ రాశి వారి ప్రశాంత స్వభావానికి అనుకూలంగా ఉంటుంది. వారి జీవితంలో శాంతి సౌభాగ్యం నెలకొనాలని వారి కోరికలు తీరాలని కోరుకుంటూ తెలుపు రంగు రాఖీని కట్టడం మంచిది.

మిథున రాశి…

మిధున రాశి వారికి ఆకుపచ్చ రంగు రాఖి మేదస్సును సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఇది వారిలోని సంభాషణ నైపుణ్యాలను ఉచ్చుకతను పెంచి ఉపగ్రహాన్ని బలపరుస్తుంది. పచ్చ రంగు పెరుగుదలను సామరస్యాన్ని సూచిస్తుంది. ఇది మిధున రాశి వారి బహుముఖ ప్రజ్ఞకు అనుగుణంగా ఉంటుంది. వారి జీవితంలో మేధస్సు వికసించాలని కొత్త ఆలోచనలు కోరుతూ ఆకుపచ్చ రాఖీని కట్టడం శుభప్రదం.

కర్కాటక రాశి…

కర్కాటక రాశి వారికి తెలుపు రంగు రాఖి మనశ్శాంతిని ఆధ్యాత్మికతను పెంచుతుంది. ఇది వారిలోని సునితత్వాన్ని సంరక్షణ బాధ్యతను పెంచి చంద్రుడిని బలపరుస్తుంది. తెలుపు రంగు ప్రేమను చూచిస్తుంది. ఇది కర్కాటక రాశి వారికి మాతృత్వ స్వభావాన్నికి అనుగుణంగా ఉంటుంది. వారి జీవితంలో ప్రేమ ఆప్యాయత ఉండాలని కోరుకుంటూ తెలుపు రంగు రాఖీని కట్టడం మంచిది.

సింహా రాశి…

సింహ రాశి వారికి పసుపు ఎరుపు రంగు రాఖీలు నాయకత్వ లక్షణాలను పెంచుతుంది. ఇది వారిలోని సృజనాత్మకతను సూర్యుడు శక్తిని పెంచుతుంది. పసుపు ఎరుపు రంగులు శక్తిని ఉత్సాహాన్ని సూచిస్తాయి. ఇది సింహ రాశి వారికి విశ్వాసానికి నాయకత్వ లక్షణాలకు అనుగుణంగా ఉంటాయి. వారిలోని నాయకత్వ లక్షణాలు మరింతగా విభజించాలని వారు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటూ ఈ రంగు రాఖీలను కట్టవచ్చు.

కన్యా రాశి…

కన్యారాశి వారికి పచ్చ రంగు రాఖీ విశ్లేషణాత్మక శక్తిని క్రమశిక్షణను పెంపొందిస్తుంది. వారిలోని క్రమబద్ధతను సేవా భావాన్ని పెంచి మధుగ్రహాన్ని బలపరుస్తుంది. పచ్చ రంగు వృద్ధిని స్వస్థతను సూచిస్తుంది. ఆరోగ్యం బాగుండాలని వారు తమ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ పచ్చ రంగు రాఖీలను కట్టడం శుభప్రదం.

తులా రాశి…

తులారాశి వారికి తెలుపు రంగు రాఖీ సామరస్యాన్ని సమతుల్యతను తెస్తుంది. ఇది సహకార భావాన్ని పెంచి చంద్రగ్రహాలను బలపరుస్తుంది. తెలుపు రంగులు సామరస్యాన్ని శాంతిని సూచిస్తుంది. ఇది తులా రాశి వారి సమతుల్య స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. వారి జీవితంలో సమతుల్యతను నెలకొనాలని వారి సంబంధాలు బల్పడాలని కోరుకుంటూ ఈ రాఖీని కడతారు.

వృశ్చిక రాశి…

వృశ్చిక రాశి వారికి ఎరుపు రంగు రాఖీ ధైర్యాన్ని పట్టుదలను ఇస్తుంది. ఇది కుజుడిని బలపరుస్తుంది. ఎరుపు రంగు శక్తిని చూచిస్తుంది ఇది వృశ్చిక రాశి వారి తీవ్ర స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. వారిలోని ధైర్యం పట్టుదల పెరగాలని వారు ఎల్లప్పుడూ లక్ష్యాలను సాధించాలని సోదరిమణులు కోరుతూ ఈ రాఖీని కడతారు.

ధనస్సు రాశి…

ధనస్సు రాశి వారికి పసుపు రంగు రాఖీ శుభప్రదం. పసుపు సూర్యుని రంగు కాంతి వెచ్చదనం ఆశావాదానికి ప్రతీకరణ. జ్ఞానం ఆధ్యాత్మికత సానుకూల శక్తిని సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు రంగు కుజ బలాన్ని పెంచుతుంది. కుజుడు ధైర్యం శక్తి ఉత్సాహన్నికి కారకుడు.

Rakhi Purnima రాఖీ పండుగ రోజు ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కడితే మంచిది

Rakhi Purnima : రాఖీ పండుగ రోజు ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కడితే మంచిది…!

మకర రాశి…

మకర రాశి వారికి నీలం రంగు రాఖీ అనుకూలం. ప్రశాంతత స్థిరత్వం వివేకాన్ని సూచిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం నీలం రంగు శని గ్రహ ప్రభావాన్ని పెంచి శుభ ఫలితాలను ఇస్తుంది. శని గ్రహం క్రమశిక్షణ కృషి సహనం బాధ్యతాయుత సుభావాన్ని ఇస్తుంది. మకర రాశి వారు కష్టపడి పనిచేసే తత్వం లక్ష్యం వైపు మొండి పట్టుదల కలిగి ఉంటారు. నీలం రంగు రాఖీ ధరించడం వలన వారిలోని లక్షణాలు మరింత బలోపేతమే వారు తమ లక్ష్యాలను సాధించడంలో మరింత ఏకగ్రతత సంకల్పం సహనం కలిగి ఉంటారు.

కుంభ రాశి…

కుంభ రాశి వారు ఆకాశ రంగు నీలం రంగు రాఖీని ధరించడం మంచిది. ఇది స్వేచ్ఛ వ్యక్తిత్వం ఆవిష్కరణ మానవతా దృక్పథాన్ని సూచిస్తుంది. ఇది కూడా శని గ్రహంతో సంబంధం కలిగి ఉంది. కుంభరాశి వారి స్వతంత్రర భావాలు విన్నృత ఆలోచనలు సమాజం పట్ల సేవా దృక్పథం కలిగి ఉంటారు. నీలం రంగు రాఖీని ధరించడం వలన వారిలోని లక్షణాలు మరింత ప్రోత్సహించబడి వారు ప్రత్యేకతను ప్రదర్శించడంలో కొత్త ఆలోచనలను అన్వేషించడంలో మరింతగా కృషి చేస్తారు.

మీన రాశి…

మీన రాశి వారికి పసుపు రంగు రాఖి శుభప్రదం. మీన రాశి వారు సృజనాత్మకత కరుణ దృష్టి అన్వేషణ కలిగి ఉంటారు. పసుపు రంగు కళాత్మక స్వభావాన్ని రూపొందించడమే కాకుండా ఆధ్యాత్మిక అన్వేషణను సూచిస్తుంది. పసుపు కుజ గ్రహని కలిగి ఉండడమే కాకుండా వారిలోని ధైర్యం చొరవ పెంచుతుంది. వారి కలను సహకారం చేసుకోవడానికి శక్తినిస్తుంది.

రాఖీ శుభ సమయం…

ఈ ఏడాది రాఖీ రోజున భద్ర వచ్చింది. భద్ర అనేది పురాణాలలో ఒక చెడు శక్తి. ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు. ఈసారి భద్ర ఆగస్టు 18 నుంచి 19 మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. కాబట్టి 12: 30 నిమిషాల తర్వాత రాఖీ కట్టడం మంచిది.1:26 నిమిషాల నుండి 6:25 నిమిషాల వరకు అత్యంత మంచి సమయం. ఈరోజు మొదటి రాఖి దేవుడి దగ్గర పెట్టి తర్వాత కడితే మంచి జరుగుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది