Satya yuga Story : రాబోయే సత్యం లో మనుషులు ఎలా ఉంటారో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Satya yuga Story : రాబోయే సత్యం లో మనుషులు ఎలా ఉంటారో తెలుసా..?

Satya yuga Story : ఈ అనంతకాల చిత్రంలో యుగాలు నాలుగు అవి సత్య యుగం , త్రేతా యుగం, ద్వాపర యుగం కలియుగం వీటిలో ఇప్పటికి మూడు యుగాలు గడవగా ప్రస్తుతం కలియుగం నడుస్తుంది. ఈ సత్య యుగం గురించి బ్రహ్మ మార్కండేయ పురాణాల్లో విపులంగా వివరించబడింది. మరి సత్య యుగం ఎలా ఉండబోతోంది. కలియుగం ఎలా అంతమయ్యే సత్య యుగం ప్రారంభమవుతుంది. అప్పటి మనుషులు ఎలా ఉంటారు. తదితరు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం కలియుగంతానికి […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 February 2024,11:30 am

ప్రధానాంశాలు:

  •  Satya yuga Story : రాబోయే సత్యం లో మనుషులు ఎలా ఉంటారో తెలుసా..?

Satya yuga Story : ఈ అనంతకాల చిత్రంలో యుగాలు నాలుగు అవి సత్య యుగం , త్రేతా యుగం, ద్వాపర యుగం కలియుగం వీటిలో ఇప్పటికి మూడు యుగాలు గడవగా ప్రస్తుతం కలియుగం నడుస్తుంది. ఈ సత్య యుగం గురించి బ్రహ్మ మార్కండేయ పురాణాల్లో విపులంగా వివరించబడింది. మరి సత్య యుగం ఎలా ఉండబోతోంది. కలియుగం ఎలా అంతమయ్యే సత్య యుగం ప్రారంభమవుతుంది. అప్పటి మనుషులు ఎలా ఉంటారు. తదితరు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం కలియుగంతానికి వచ్చేటప్పటికి ధర్మం అనేది పూర్తిగా నశించిపోతుంది. అన్యాయం అక్రమాలు పెచ్చులుతాయి. వావి వరసలు తప్పి స్త్రీ పురుషులు దారి తప్పుతారు. తల్లితండ్రులను బిడ్డలను పట్టించుకోరు.. భార్యను భర్త చూడడు.. భర్తను భార్య పట్టించుకోకుండా తన సుఖం తాను చూసుకుంటుంది. ప్రజలు విచిత్ర వ్యాధుల బారిన పడి పిట్టలు రాలినట్లు రాలిపోతుంటారు. కానీ ప్రభావం వల్ల దైవభక్తి పూర్తిగా నశించి నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని విచ్చలవిడితనం పెరిగిపోతుంది.

ఆకస్మిక ఉత్పాతాలు సంభవించి దేశాలు దేశాలే కడలిలో కలిసిపోతాయి. సూర్యచంద్రుని గతి తప్పుతారు. నక్షత్రాలు కళావిహీనమవుతాయి. అప్పటికి మానవ ఆయుర్దాయం 100 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలకు చేరుకుంటుంది. చెంబలా అనే నగరంలో శ్రీమహావిష్ణువు పదవ అవతారంగా జన్మించి కలిని అంతం చేయడంతో పెద్ద ప్రళయం సంభవించి ఈ కలియుగం అంతమవుతుంది. కలియుగం అంతం కావడంతో కాలచక్రంలో మొదటి యోగమైన సత్య యుగం మరల ప్రారంభమవుతుంది. ఈ యుగం యొక్క కాల పరిమాణం 1728 వేల సంవత్సరాలు. సత్య యుగంలో కేవలం పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు..మిగిలిన సమయాన్ని మొత్తం గడుపుతారు. ఈ యుగంలో అన్ని పరిపూర్ణంగా లభించడంతో ప్రజలు ప్రశాంతంగా ఉంటూ మిగిలిన సమయాన్ని మొత్తం భగవన్నామస్మరణలో గడుపుతారు. దేవతలు కూడా దేవలోకము నుండి భూమి పైకి వచ్చి ప్రజల మధ్యలోనే తిరుగుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటారు. ఎలాంటి కాలుష్యం లేని స్వచ్ఛమైన వాతావరణ ఉండడంతో వ్యాధులు అనేవి దరి చేరవు.

ఈ యుగంలో మనుషుల సగటు ఆయుర్దాయం లక్ష్య సంవత్సరాలుగా ఉంటుంది. ఎత్తు 11 అడుగుల వరకు పెరుగుతారు. ఎండాకాలం చలికాలం అనేవి ఉండవు. కేవలం వానాకాలం మాత్రమే ఉంటుంది. వర్షాలు కూడా ఎంతవరకు అవసరమో అంతే కురుస్తాయి. ఎక్కడ చూసినా ఆనందం తాండవిస్తుంది. జ్ఞానం జ్ఞానం తపస్సు ఈ మూడింటి పైనే వీరు సృష్టిని నిలుపుతారు. అహింస, దొంగతనం, అకృత్యాలు అసలే ఉండవు. ఆయుధాలతో పనే ఉండదు. సత్యోగంలో మానవులకు అసలు ధనం పైన వ్యామోహమే ఉండదు. ప్రజలందరూ అలుపు సొలుపు లేకుండా ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఎవరికీ ఎంత అవసరమో అంత పండించుకుంటూ వారి అవసరార్థం ఇచ్చుపుచ్చుకుంటూ ఉంటారు. అకాల మరణాలు అనేవి ఉండవు. వారి ఆయుర్దాయ ముగిస్తేగాని వారి స్వయంగా పుణ్యలోకాలకు పయనం అవుతారు. ఎలాంటి ఆకస్మిక ఉత్పాతాలు ప్రకృతి విపత్తులు సంభవించవు. క్రూర జంతువులు మనుషుల మధ్య తిరుగుతూ వారితో కలిసిపోతాయి. సత్య యుగంలో మానవులు తమ తప సిద్దితో భగవంతునితో నేరుగా సంభాషిస్తారు. చూశారుగా రాబోయే సత్యయుగం ఎంత అద్భుతంగా ఉండబోతుందో మనం కూడా రాబోయే సత్య యుగంలో పుట్టాలంటే ఇప్పటినుంచి ఎదుటివారికి సహాయపడుతూ అవసరమైన వారికి దానధర్మాలు చేస్తూ నిష్కల్మషమైన మనసుతో భగవంతుని నామస్మరణలో ఉంటే చాలు..

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది