Sagittarius : సెప్టెంబర్ నెలలో ధనస్సు రాశి వారికి లక్ష్మీ కుబేర యోగం తప్పదు…!
Sagittarius : సెప్టెంబర్ నెల ధనుస్సు రాశి వారి రాశి ఫలితాలు.. ఈ మాట వింటే మీకు వ్యవహారం జయం. ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో లక్ష్మి కుబేర యోగం తప్పదు. మరి ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది. ధనుస్సు రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.? ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విశేషాలు మనమే తెలుసుకుందాం.. ధనుస్సు రాశి తొమ్మిదవ రాశి. ఈ రాశికి అధిపతి గురువు ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఎవరు కూడా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు మీరు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేయాలి అనుకుంటారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు పాటించరు. ఏ విషయం అయినా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు అని చెప్పుకోవాలి.
అయితే ధనుస్సు రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతోంది. వారికి లక్ష్మీ కుబేర యోగం అనేది ఎందుకు రాబోతుంది అనే విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహాల అనుకూలతల వల్ల వీరికి ఎంతో అద్భుతమైనటువంటి యోగం అనేది రాబోతోంది. ఇక వ్యవహార జయం. అంటే మీరు ఎటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సరే ఆ కార్యక్రమంలో మీరు విజయాన్ని అందుకోబోతున్నారు.. ఈ సెప్టెంబర్ ధనుస్సు రాశి వారు ఇప్పటివరకు దేని గురించి ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా వారికి ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో సఫలీకృతం అవుతాయని చెప్పుకోవచ్చు. ఇక సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో తెలుసా.. వారు వారికి అద్భుతమైనటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి.
వివాహ సమస్యలతో ఇప్పటివరకు వివాహ గడియలు రాలేదు అని బాధపడుతున్న వారికి కూడా శుభవార్తలు వినేటువంటి అవకాశాలున్నాయి. మీకు తెలిసిన సంబంధాలే మిమ్మల్ని ఏరుకోరి వచ్చి చేసుకుంటామని అడిగేటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇక విద్యార్థులు ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మంచి చదువులు చదువుకుంటారు. ఉత్తీర్ణత శాతం అనేది కూడా పెంచుకుంటారు. విద్యార్థులు విదేశాలలో చదువుకోవాలి అనుకుంటున్న వారికి కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అడుగులు ముందుకు వేయండి. ప్రతి అడుగు విజయం వైఫై పయనిస్తుంది. ఆరోగ్య విషయంలో ధనుస్సు రాశి వారు కొంత జాగ్రత్తలు పాటించాలి.
ఏదైతే ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటారో అవి ఆరోగ్యం మీద మీకు ప్రభావం అనేది పడుతూ ఉంటుంది. మానసిక ఆందోళన తగ్గించుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం లాంటిది చేస్తూ ఉండాలి. యోగ ప్రాణాయామం లాంటిది మీరు ఆచరిస్తూ ఉన్నట్టు అయితే కనుక అవి మీకు తగ్గించేదిగా మిమ్మల్ని తీసుకువెళ్తాయి. ఇక మంచి పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ప్రతిని చక్కగా సాధిస్తారు.