Somvati Amavasya : మీ దోషాలు పోవాలంటే సోమవతి అమావాస్యనాడు ఇలా చేయండి !
Somvati Amavasya : సోమవారం.. అమావాస్య వచ్చినరోజును సోమవతి అమావాస్య అంటారు. ఏప్రిల్ 12న సోమవతి అమావాస్య. ఈరోజు చాలా విశేషమైనది. సాధారణంగా సోమవారం శివుడికి ప్రతీకరమైనదిగా చెప్తారు. అంతేకాదు ఈరోజున శివారాధన చేయడం వల్ల శ్రీఘ్రంగా ఆ మహాదేవుడి అనుగ్రహం లభిస్తుంది. అయితే సోమవారం అమావాస్య కలసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. పూర్వం చంద్రుడు తన బాధలు పోవడానికి శివుడిని ప్రార్థిస్తే సోమవారంనాడు అమావాస్య వచ్చినప్పుడు ఆరాధించమని చెప్పాడు. అలా చేయగానే చంద్రుడి బాధలు పోయ్యాయి. దీంతో అప్పటి నుంచి సోమవారం అమావాస్యను చాలా విశేషమైనదిగా భావిస్తున్నారు.
Somvati Amavasya : ఏం చేయాలి ?
ముఖ్యంగా సోమవతి అమావాస్య రోజున పూర్వీకులను అంటే పితృదేవతలను పూజించాలి. దీనివలన మంచి జరుగుతుందని పూర్వీకుల విశ్వాసం అంతేకాదు అనుభవంలో కూడా ఇది నిరూపితమైనది. పితృదేవతలకు పూజచేయకూడని వారు శివాలయంలో రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్లుఉ పేర్కొంటున్నారు. రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
పితృదేవతలకు ఈ రోజున పిండప్రదానం చేస్తే పెద్దలు సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు శుభం జరుగుతుందని పురాణాలలో పేర్కొన్నారు. సోమవతి అమావాస్య రోజున వివాహితులు , అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలను నెరవేరుతాయి. జాతకంలో సర్పదోషాలు తొలగిపోతాయి. కాల సర్పదోషాలు తొలగిపోవాలంటే.. సోమవతి అమావాస్య రోజున రావిచెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణాలు చేసి నట్లయితే ఆ దోషం పోతుంది. అంతేకాదు ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి