Somvati Amavasya : జులై 17 సోమావతి అమావాస్య రోజు ఈ చెట్టు కొమ్మను గుమ్మానికి కడితే దుష్ట శక్తులన్నీ బయటికి పోతాయి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Somvati Amavasya : జులై 17 సోమావతి అమావాస్య రోజు ఈ చెట్టు కొమ్మను గుమ్మానికి కడితే దుష్ట శక్తులన్నీ బయటికి పోతాయి…!!

 Authored By aruna | The Telugu News | Updated on :16 July 2023,11:00 am

Somvati Amavasya : జూలై 17 సోమవతి అమావాస్య ఈరోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అమావాస్య అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజు శివుని ఆరాధిస్తే ఎంతో శుభం కలుగుతుంది. అలాగే సోమవతి అమావాస్య రోజున సాయంత్రం వేళ ఈ పరిహారాలతో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో శుభం సౌఖ్యం ఏర్పడుతుంది. మరి సోమవతి అమావాస్య రోజు చేయవలసిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం. శివుడిని ప్రవహించే నది స్నానం చేసి పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఈ సందర్భంగా శుభమతి అమావాస్య రోజున పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. రావి చెట్టుకు 108 సార్లు ప్రదర్శనలు చేయాలి.. ఇలా చేయడం వలన ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. సోమవతి అమావాస్య రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన తులసి చెట్టును పూజించడం చాలా ముఖ్యమైన గ్రంథాలలో పేర్కొనబడింది. ఈరోజున 108 సార్లు తులసి కార్యక్రమాలు చేస్తే దరిద్రం తొలగిపోతుంది. తులసి చెట్టుతో తిలకం రాయాలి. సోమవతి అమావాస్య రోజున మీ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించుకునేందుకు రాళ్ళ ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఉప్పుకు సంబంధించిన పరిహారం ఎంతో ప్రభావంవంతంగా పనిచేస్తున్నది చాలామంది చెబుతారు. అమావాస్య రోజున సాయంత్రం అర లీటర్ నీటిలో 50 గ్రాముల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయాలి.

ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. సోమవతి అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని తినిపించడం వల్ల మీ జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని మీ కుటుంబంలో ఐక్యత పెరుగుతుందని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది. సోమవతి అమావాస్య రోజున సాయంకాలం సమయంలో కొన్ని కుంకుమ పువ్వులు వేయాలి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల మీరు సంపద రెట్టింపు అవుతుంది. సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదర్శనలు చేసి సోమవతి కథనం ఒక్కసారి గుర్తుచేసుకొని ఉపవాస దీక్ష తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఈరోజు గుమ్మానికి వేపాకులను కడితే దుష్టశక్తులన్ని ఇంటి బయట వెళ్లిపోతాయి.. ఇంట్లో శుభం సౌఖ్యం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది