Solar Eclipse 2025 : రేపు సూర్య గ్రహణం… భారతదేశంలో దాని ప్రభావం ఎంతవరకు ఉంది…? గ్రహణం ఏర్పడు సమయములు ఎప్పుడు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Solar Eclipse 2025 : రేపు సూర్య గ్రహణం… భారతదేశంలో దాని ప్రభావం ఎంతవరకు ఉంది…? గ్రహణం ఏర్పడు సమయములు ఎప్పుడు..?

 Authored By ramu | The Telugu News | Updated on :28 March 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Solar Eclipse 2025 : రేపు సూర్య గ్రహణం... భారతదేశంలో దాని ప్రభావం ఎంతవరకు ఉంది...? గ్రహణం ఏర్పడు సమయములు ఎప్పుడు..?

Solar Eclipse : 2025 వ సంవత్సరం పాల్గొనమాసం అమావాస్య మార్చి 29వ తేదీన సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడింది. ఈ సంవత్సరంలో మొదట సూర్యగ్రహణం ఈరోజున అంటే, మార్చి 29న ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఇలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఈరోజు తెలుసుకుందాం. ఈ 2025 వ సంవత్సరంలో ఒకటే నెల అంటే, మార్చి 14 హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం సంభవించింది. మరలా ఇదే నెలలో మరో గ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో రెండవ గ్రహణం సూర్యగ్రహణం మార్చి 29వ తేదీన 2025న సంభవిస్తుంది. ఈసారి మార్చి 29న చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు. రోజు సూర్యగ్రహణం ఏర్పడ నున్నదని మాత్రమే కాదు. ఈరోజు నా ఒకేసారి అనేక శుభయోగాలు ఏర్పడతాయి కనుక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 29న పాల్గొన అమావాస్య. ఈరోజు సూర్యగ్రహణంతో పాటు శని సంచారం కూడా జరుగుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని భావిస్తున్నారు. మార్చి 29న సూర్యుడు, రాహువు, శుక్రుడు, చంద్రుడు మీన రాశిలో ఉంటారు. దీనివలన నా ఈ గ్రహణం ప్రభావం మరింత ముఖ్యమైనదిగా మారింది అని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Solar Eclipse 2025 రేపు సూర్య గ్రహణం భారతదేశంలో దాని ప్రభావం ఎంతవరకు ఉంది గ్రహణం ఏర్పడు సమయములు ఎప్పుడు

Solar Eclipse 2025 : రేపు సూర్య గ్రహణం… భారతదేశంలో దాని ప్రభావం ఎంతవరకు ఉంది…? గ్రహణం ఏర్పడు సమయములు ఎప్పుడు..?

Solar Eclipse 2025 భారతదేశంలో సూర్యగ్రహణం కనిపిస్తుందా

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు… సూర్యునికి, భూమికి మధ్య వచ్చినప్పుడు, చంద్రుడి వెనుక ఉన్న సూర్యుడి నీడ కొంత సమయం వరకు పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఈ ప్రక్రియనే సూర్యగ్రహణం అంటారు. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. అంతేకాదు ఈ గ్రహణం భారతదేశ కాలమానం ప్రకారం రాత్రి సమయంలో సంభవిస్తుంది. మహా భారత దేశంలో కనిపించదు. అందువల్ల ఈ గ్రహణానికి మన దేశంలో మతపరమైన ప్రభావం ఉండదు. సూతక కాలం కూడా చెల్లదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సూర్యగ్రహణం భారత దేశంలో ఎటువంటి గణనీయమైన ప్రభావాన్ని చూపదు.

భారతదేశంలో సూర్యగ్రహణం 2025 సమయం : కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం మార్చి 29న మధ్యాహ్నం 2:20 తలకు ప్రారంభమై సాయంత్రం 4:17 గంటలకు ముగుస్తుంది.ఈ గ్రహణం మీన రాశి, ఉత్తరభాద్రపద నక్షత్రాలలో సంభవిస్తుంది. అందువల్ల ఈ గ్రహానికి జ్యోతిష్య ప్రాముఖ్యత ఎక్కువగా పరిగణించబడుతుంది.

సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఎక్కడ కనబడుతుంది : ఈ సూర్యగ్రహణం బెర్బుడా, డేన్మా ర్క్, ఆస్ట్రియా, బెల్జియం, ఉత్తర బ్రెజిల్, ఫిన్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, ఐర్లాండ్, మొరాకో, గ్రీన్ ల్యాండ్, కెనడా తూర్పు భాగం, లిథువేనియా, హలండ్, పోర్చుగల్, ఉత్తర రష్యా, స్పెయిన్, సురినామ్, స్వీడన్, పొలాండ్, పోర్చుగల్, నార్వే, ఉక్రెయిన్, స్విజర్లాండ్, ఇంగ్లాండ్, అమెరికాలోని తూర్పు ప్రాంతంలో కనిపిస్తుంది.

సూర్యగ్రహణం.. శని సంచారం : మార్చి 29, 2025న సూర్యగ్రహణంతో పాటు మరో ముఖ్యమైన సంఘటన జరగబోతుంది. అదే శని సంచారం. ప్రస్తుతం శని కుంభరాశిలో ఉంటాడు. మార్చి 29న శని మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఇది ఒక ప్రత్యేక యాదృచ్ఛికం కానుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది