Kings : భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప రాజులు వీరే…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Kings : భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప రాజులు వీరే…!

Kings : భారతదేశ చరిత్ర రాజుల రహస్యాలతో ,నిండుగా ఆలయాలతో, నిరంతరం యుద్ధాలతో నిండిపోయి కనిపిస్తుంది. తన దేశం కోసం ప్రజల కోసం ఎంతో చేసిన రాజుల పేర్లు సువర్ణ అక్షరాల తో లిఖించబడ్డాయి. ఆ రాజుల శౌర్యం, పరాక్రమం అద్భుతం అని చెప్పవచ్చు. మరి మన భారతదేశానికి చెందిన అంతటి పరాక్రమవంతులైన రాజుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… Kings : హర్షవర్ధన మహారాజు… 41 ఏళ్ల పాటు ఉత్తర భారతదేశాన్ని పాలించ హర్షవర్ధన మహారాజు […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 April 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Kings : భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప రాజులు వీరే...!

Kings : భారతదేశ చరిత్ర రాజుల రహస్యాలతో ,నిండుగా ఆలయాలతో, నిరంతరం యుద్ధాలతో నిండిపోయి కనిపిస్తుంది. తన దేశం కోసం ప్రజల కోసం ఎంతో చేసిన రాజుల పేర్లు సువర్ణ అక్షరాల తో లిఖించబడ్డాయి. ఆ రాజుల శౌర్యం, పరాక్రమం అద్భుతం అని చెప్పవచ్చు. మరి మన భారతదేశానికి చెందిన అంతటి పరాక్రమవంతులైన రాజుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Kings : హర్షవర్ధన మహారాజు…

41 ఏళ్ల పాటు ఉత్తర భారతదేశాన్ని పాలించ హర్షవర్ధన మహారాజు గురించి ఎంత చెప్పినా తక్కువే.అతను తండ్రి అన్నయ్య మరణించిన తర్వాత రాజ్యాధికారాలు అతని చేతికి వచ్చాయి. అతను ఇప్పటికి చెప్పుకోదగ్గ రాజుగా పేరు తెచ్చుకున్నాడు.హర్షవర్ధన పాలనలో భారతదేశంలోని ప్రజల ఆర్థిక అభివృద్ధి అద్భుతంగా ఉండేదని తెలుస్తుంది.
Kings : కృష్ణదేవరాయలు….

శ్రీ కృష్ణదేవరాయలు ఎంతో గొప్ప రాజు.ఆయన పాలన అంటే అక్బర్ బాబర్ కి కూడా చాలా ఇష్టం.బాబర్ తన ఆత్మ కథ లో కూడా కృష్ణదేవరాయలు గురించి ధైర్యవంతుడు శక్తివంతుడుగా అభినందించాడు. తులు రాజ్యం నుంచి వచ్చిన కృష్ణదేవరాయలు ఆ సమయంలో అత్యంత శక్తివంతమైన రాజుగా ఉండేవాడు.

పోరస్ రాజు…

పోరస్ రాజు దైర్య సాహసలు చూసి శత్రువులు కూడా భయపడే వారట.రాజుల కాలంలో భారతదేశం ఒక దేశం కాదు.అనేక చిన్న పెద్ద రాష్ట్రాల సమూహం .ఆ సమయంలో పోరస్ రాజ్ కూడా ఒక చిన్న దేశానికి శక్తివంతమైన రాజుగా ఉండేవాడు.చుట్టుపక్కల ఉన్న అన్నిరాజ్యాలలో శక్తివంతమైన రాజుగా పేరు తెచ్చుకున్నాడు.

మహారాణ ప్రతాప్…

భారత దేశ స్వతంత్ర సమరయోధుడిగా పిలుచుకునే మహా రాణా ప్రతాప్ గురించి ఆయన ధైర్య సాహసాలకు సంబంధించిన ఎన్నో కథలు చిన్నప్పుడు స్కూల్లో పాఠాలుగా చదువుకున్నాం.7 అడుగుల 5 అంగుళాలు ఎత్తు ఉండే రాణా ప్రతాప్ బలాన్ని ఆయన పట్టుకునే ఈటను బట్టి ఆయన శక్తిని అంచనా వేయవచ్చట.

అశోక చక్రవర్తి…

అశోక్ చక్రవర్తి గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా కొంచెం మిగిలే ఉంటుంది.అతని గుర్తు ఇప్పటికీ మన జాతీయ జెండాలో కనిపిస్తుంది. భారతదేశ చక్రంపై రూపకల్పన చేసింది అశోకుడు. ఢిల్లీ లో ఆయన నిర్మించిన ఐదు స్తంభాలను చూడడానికి ఇప్పటికి ప్రతిరోజు ఎంతోమంది ప్రజలు దూర దూరాల నుంచి వస్తూ ఉంటారు.

అక్బర్ …

అక్బర్ పాత్ర భారతదేశం లో ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. అక్బర్ తన మొగల సామ్రాజ్యాన్ని మూడింతలు విస్తరించాడు. ఒకవైపు తన రాజ్యాన్ని విస్తరిస్తూనే స్త్రీ కోసం, మతం కోసం, విద్య కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టాడు. మొగల్ కాలంలో హిందూ ముస్లింలను ప్రతిష్ట పట్టించిన ఏకైక రాజు అక్బర్.

Kings భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప రాజులు వీరే

Kings : భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప రాజులు వీరే…!

సముద్రగుప్తుడు…

గుప్త అను వంశానికి చెందిన , రెండవ రాజుగా అలాగే భారతదేశ నెపోనియన్ గా పిల్చుకునే సముద్ర గుప్తుడు గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు.బాల్యం నుంచి అతనికి అలవడిన శక్తి సామర్థ్యాల చూసి తమ వారసుడిగా ప్రకటించారు అతని తండ్రి చంద్రగుప్తుడు.

పృధ్విరాజ్ …

యుద్ధంలో ఆయనని ఓడించడం ఎవరితరం అయ్యేది కాదు. కానీ మరణం అనేది సొంత వాళ్ళ నుంచి వచ్చినప్పుడు ఎవరు ఏమి చేయలేరు కదా. పృధ్విరాజ్ చౌహాన్ కథ కూడా అదే. ఎంతో పరాక్రమవంతుడైన పృధ్వీరాజ్ తన మేనమామ చేతిలో మరణించాడు.

చంద్రగుప్త మౌలియ…

చిన్నప్పటి నుంచి మనం చంద్రగుప్త మౌలియ గురించి కథలు కథలుగా చెప్పుకున్నాం. భారతదేశంలో మౌళియ స్థాపకుడు ఇతడే. చంద్రగుప్త మౌలియ తన జీవితంలో ఏదైనా సాధించాడు అంటే అది తన గురువైన చాణక్యుడి వలన అని చెప్పాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది