Rudraksha : రుద్రాక్షలు ధరించేవారు ఎలాంటి నియమాలు పాటించాలి.. ఎందుకో తెలుసా..?
Rudraksha : రుద్రాక్షలు పరమేశ్వరుని స్వరూపమని హిందువులు ఎక్కువగా నమ్ముతుంటారు. శివుడి కన్నీళ్ల నుంచి జాలువారిన నీటి బిందువులు రుద్రాక్ష చెట్టుగా మారాయని నమ్ముతారు. అందుకే రుషులు, పూజారులు, సన్యాసులు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎక్కువగా రుద్రాక్షలు ధరిస్తారు. సాధారణ మనుషులు కూడా భక్తితో వీటిని మెడలో వేసుకుంటారు. పూజ చేసే సమయంలో ఈ మాలతో జపం చేస్తుంటారు. అందుకే భారతీయ హిందువులు ఎంతో పవిత్రంగా రుద్రాక్షలను భావిస్తారు.కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే ఈ చెట్లు పెరుగుతాయి.
రుద్రాక్షలలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏక ముఖి నుంచి పన్నెండు, పదిహేను, ఇరవై ఒకటి ఇలా పలు సంఖ్యలలో విభిన్న ముఖాలు కలిగి ఉంటాయి. కాగా పంచముఖ రుద్రాక్షలు ఎక్కుగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దీనిని ధరించిన అన్ని విజయాలే వరిస్తాయని నమ్ముతారు.రుద్రాక్షలు మెడలో వేసుకుంటే గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్ముతుంటారు. అందుకే రుద్రక్షలు దరించడంలో కొన్ని నియమాలు పాటిస్తారు.

these are rules rudraksha wearing lord shiv mantra
ఎరుపు లేదా పసుపు దారంతో లేదా బంగారు తీగతో చేసిన రుద్రాక్ష మాల ధరించాలి. అలాగే గంగా జలంతో శుభ్రం చేసిన తర్వాతే వేసుకోవాలి. ఈ రుద్రాక్ష మాల ధరించేటప్పుడు శివుడిని తలుచుకుని ఎంతో శుద్దితో ఉండాలి. అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. స్త్రీలు పీరియడ్స్ సమయంలో ఈ మాలను తీసేయాలి. ఆ తర్వాత శుద్ది చేసి వేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే రుద్రాక్ష మాల ధిరించేటప్పుడు రుద్రాక్షల సంఖ్య బేసి సంఖ్యగా ఉండాలి. అలాగే ఒక్కసారి మీరు ధిరించాక ఇతరులకు ఆ మాల ఇవ్వకూడదు.