Rudraksha : రుద్రాక్షలు ఎవరికి ప్రతీకలు.. వాటిని ఎందుకు ధరించాలి?
Rudraksha : మన హిందూ సంప్రదాయాల ప్రకారం… రుద్రాక్షను దేవ దేవుడైన పరమేశ్వరుని స్వరూపంగా భావిస్తారు. శివుడి అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారాయని… అలాంటి వృక్షాలకు కాసిన కాయలనే రుద్రాక్షలు అంటారని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించువారేనని పురాణాల్లో వివరించబడింది. ఇప్పటికీ బ్రాహ్మణులు, పూజారులు, వేదాంతులు, గురువులు లాంటివారు వీటిని ధరిస్తారు.
ధరించుట వీలుకాని వారు పూజా గృహముల యందు ఉంచి పూజించుట కద్దు.వీటిని ముఖ్యంగా ముఖాల సంఖ్యా పరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి పన్నెండు, పదఐదు ముఖాల వరకూ కలిగి ఉంటాయి. ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు కూడా ఉన్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ప్రశస్తమయినదిగా చెపుతారు. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని నమ్ముతారు. అలాంటి రుద్రాక్షల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
- ఏకముఖి రుద్రాక్ష పరమ శివుడికి ప్రతీక
- ద్విముఖి రుద్రాక్ష అర్థనారీశ్వర స్వరూపం
- త్రిముఖ రుద్రాక్ష అగ్ని దేవుడికి స్వరూపం
- చతుర్ముఖి రుద్రాక్ష బ్రహ్మదేవుడికి ప్రతీక
- పంచముఖి రుద్రాక్ష మహామృత్యుజ్వాల అనగా కాలాగ్ని స్వరూపిణి
- షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయుని ప్రతీక
- అష్టముఖి రుద్రాక్ష మహా గణపతి
- నవముఖి రుద్రాక్ష మహా గణపతి
- దశముఖి రుద్రాక్ష శ్రీ మహా విష్ణువు స్వరూపం
- ఏకాదశ ముఖి రుద్రాక్ష మహేంద్రుడి ప్రతి రూపం
- ద్వాదశ ముఖి రుద్రాక్ష ఇంద్రునికి ప్రతీక
- చతుర్దశ ముఖి రుద్రాక్ష చిరంజీవి హనుమకి ప్రతి రూపం
- ఇరవై రెండు ముఖాల రుద్రాక్షలు దొరుకతాయని అంటారు. ఏ రుద్రాక్ష ధరించినా గంగా జంలతో శుద్ధి చేసి సంబంధిత మంత్ర జపం చేసి, సోమవారం ప్రాతః కాలంలో ధరించండి. అంతే కాదండోయ్రుద్రాక్షలు ధరించుట వలన గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం మొదలగు దీర్ఘ కాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అన్ని వర్ణముల వారు ధరించ వచ్చును. అయితే రుద్రాక్షలను 108 గాని, 54 గాని, 27 గాని బంగారంస వెండి లేదా రాగి తీగతో మాలగా తయారు చేయించి మెడల వేసుకోవాలి. రుద్రాక్ష మాలలను జప మాలగా కూడా ఉపయోగించవచ్చును.