Tirumala Tirupati Temple : తిరుమలలో ఆడవాళ్లు గుండు కొట్టించుకోవచ్చా… స్వామి వారి తలకి గాయం చేసింది ఎవరు..?
ప్రధానాంశాలు:
Tirumala Tirupati Temple : తిరుమలలో ఆడవాళ్లు గుండు కొట్టించుకోవచ్చా... స్వామి వారి తలకి గాయం చేసింది ఎవరు..?
Tirumala Tirupati Temple : అసలు తిరుమలలోని ఎక్కువగా తలనీలాలు ఎందుకు ఇస్తారు. తిరుమలలో తలనీలాలు సమర్పించుకోవడానికి మనందరికీ తెలిసిన కథ ఒకటి ఉంది. అదేంటంటే స్వామివారి వైకుంఠం వదిలి భూమి పైకి వచ్చాక.. ఒక గొల్లవాడు స్వామివారి తలకి గాయం చేస్తాడు. ఆ గాయం వల్ల స్వామివారి తలలో కొన్ని వెంట్రుకలు ఊడిపోతాయి. అంత అందమైన ముఖానికి కలలో చిన్న ఘాటు ఉండిపోయింది. అసలు గాయం ఎలా జరిగిందంటే… పూర్వం స్వామివారి మీద ఒక చీమల పర్వతం ఏర్పడింది. ఒక గోవురోజు వాటికి పాలు ఇవ్వడానికి ఆ పర్వతానికి వెళ్ళేది. అది చూసిన గొల్లవాడు తీవ్రమైన ఆగ్రహంతో గొడ్డలితో ఆవును కొట్టబోతుండగా.. స్వామివారికి దెబ్బ తగిలి కొంచెం జుట్టు రాలిపోతుంది. ఆ గాయం చూసి వకలాంబ బాధపడేవారు. ఇంత అందమైన మోకానికి ఆ గాటు లేకపోయి ఉంటే బాగుండేదని చింతించేది. తర్వాత కొన్ని రోజులకి స్వామి నీలాద్రి గట్టు దగ్గరికి వెళ్లారు. అక్కడ స్వామి ఒక చెట్టు కింద విశ్రమించేటప్పుడు నీలాదేవి అనే ఒక స్త్రీ చూస్తుంది. నీలాదేవి అక్కడ నివసిస్తుంది. కాబట్టి ఆ కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది. ఆ ఏడుకొండల్లో ఒక కొండని నీలాద్రి అంటారు. ఆమెకి స్వామివారు అంటే అపారమైన భక్తి.. ఆమె స్వామివారిని చూశాక.. స్వామివారి అందాన్ని అలానే చూస్తూ ఉండిపోయింది.
తర్వాత ఆమెకి స్వామివారి తలలో చిన్న ఘాటు కనిపించింది. ఇంత అందమైన వ్యక్తికి ఈ చిన్న ఘాట అని తన తల వెంట్రుకలు తీసి స్వామివారి తలకి సమర్పించింది. ఇంకా స్వామి కి అక్కడ వెంట్రుకలు వస్తాయి. పడుకుని ఉన్న స్వామివారి లేచాక నీలాదేవిని చూసి ఆవిడ ఆయనకు ఇచ్చిన కురులకు రుణంగా ఏమీ ఇవ్వాలి అని అడుగుతారు. అప్పుడు నీలాదేవి స్వామి రానున్న కాలంలో మీ భక్తులు మీకు భక్తితో తలనిలాలు సమర్పించుకుంటారు.అవి నాకు వచ్చేలా వరం ఇవ్వండి అని అంటుంది. ఆవిడ కోరినట్టే స్వామివారు ఆమె కోరికకు తధాస్తు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. భూమిపైన మనం తల ముందు పెట్టి వస్తాము.. అంటే తల్లి గర్భం నుండి ముందు తల వస్తుంది. ఆ శిశువుకున్న పాపాలలో తన పూర్వజన్మ పాపాలు అన్ని ఆశీస్సులు వెంట్రుకల్లోనే ఉంటాయి. అందుకే మనం శిశువుకి కొన్ని నెలలు రాగానే పుట్టు వెంట్రుకల రూపంలో గుండు కొట్టిస్తారు. వెంట్రుకలు ఇవ్వడం అంటే మన అందం, అహంకారం, మొహం దేవుడికి సమర్పించుకోవడం.. ఒక రకంగా మన తల తీసి ఆ దేవుడి దగ్గర పెట్టడం.. మన పాపాలు కర్మలు అన్నీ మన తల వెంట్రుకలకు చేరుకుంటాయి. దేవుడి దగ్గర నీలాలు సమర్పించుకుంటే మంచి జరుగుతుంది అంటారు.. మన చెడు గుణాలను వదులుకుంటే మనకు జరిగేది మంచే కదా.. ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటారు. ఆడవారి గుండు కొట్టించుకోకూడదు.. అని అంటారు…కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే ఉంది.. మొదటిగా స్వామివారికి వెంట్రుకలు సమర్పించింది ఒక స్త్రీ.. ఆవిడే నీలాదేవి ఆవిడ భక్తికి శ్రీవారు కూడా ప్రసన్నడయ్యాడు.
ఎవరు కూడా చిన్న చిన్న వాటికి దేవుడికి వెంట్రుకలు ఇస్తామని మొక్కుకోరు కదా.. ఏదైనా కష్టం వచ్చినప్పుడు తన కష్టం నుంచి సమర్పించుకుంటామని చెప్తారు అనే విషయాన్ని ఒక కథ ఉంది.పూర్వం తిరుమలగిరిలో ఒక పల్లెటూరులో ఒక అందమైన యువతీ ఉండేది.. ఎంతో అందంగా ఉండేది. అంటే తన వైపు చూసిన ఎవరు కూడా చూపు తిప్పుకోలేనంత అందంగా ఉండేది.. ఆమెకి స్వామివారు అంటే అపారమైన భక్తి.. స్వామివారికి ఎల్లప్పుడూ నిత్య పూజలు చేసేది.. కొన్నాళ్లకి ఆమెకి వివాహం జరిగింది. వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అయినా పిల్లలు కలగలేదు.. ఆ దంపతులు ఎన్నో పూజలు, పునస్కారాలు చేశారు.. కానీ వారికి సంతానం కలగలేదు.. ఇంకా ఆ విషయం వల్ల తన పైన చాలామంది చాలా రకాలుగా అనుకునేవారు అప్పుడు ఆమె స్వామి వారి దగ్గరికి వెళ్లి. స్వామి నా అందం వల్ల నేను చాలా అహంకారం.. ఇంకా పొగరుగా ప్రవర్తించాను.. అందుకు తగిన శిక్ష కూడా నేను అనుభవిస్తున్నాను.. నా ఈ అహంకారాన్ని నీకు తల నీలాలు సమర్పించుకుంటున్న అని ఆవిడ తన తలనీలాలు వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించింది. అప్పుడు ఆమె భక్తికి స్వామి మెచ్చి తల్లి అయ్యే భాగ్యం కల్పిస్తాడు.. తన అహంకారం గర్వం వదిలేసాక ఆమెకి ఎంత శుభం జరిగిందో.. మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు నాది నేను అనే స్వార్థం వదిలేసి అహం వదిలేసి స్వామివారిని దర్శనం చేసుకోండి..