Tulsi Plant : ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే.. మన ఇళ్లు అలాగే అవుతుందా?
Tulsi Plant : మనం ప్రతిరోజూ పూజ చేసుకునే.. ఇంట్లో ఉండే తులసి మొక్క ఎండిపోతే విలవిల్లాడిపోతాం. ఇంటికి ఏదైనా అరిష్టం జరుగుతుందని తెగ మదనపడుతుంటాం. అయితే తులసి మొక్క ఒక్కోసారి నీళ్లు పోయికపోయినా ఏపుగా పెరుగుతుంది. కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు పూర్తిగా మోడు బారిపోతుంటుంది. మరి కొన్ని సార్లు రంగులు మారుతుంటుంది. మనం ప్రతిరోజూ పూజ చేస్తూ… నీళ్లు పోస్తున్నా ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే మొక్క ఎండిపోయినా, రంగులు మారిపోయిన మనలో కంగారు మొదలవుతుంటుంది. అయితే తులసి మొక్క ఎండిపోతే మనం పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ఇంట్లో ఉండే తులసి మొక్క మన ఇంట్లో ఏం జరగబోతుందో కచ్చితంగా చెప్తుందంటున్నారు.తులసి చెట్టు ప్రతిరోజూ పచ్చగా, ఆరోగ్యంగా ఉంటే… ఆ ఇంట్లో ఆనందం, సంతోషాలు వెల్లివిరుస్తాయంట.
ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు రావని అర్థం. ఒక వేళ నీళ్ళు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతున్నా… ఆ మొక్క చుట్టూ చిన్న చిన్న మొక్కలు మరికొన్ని వచ్చినా ఇంట్లో వారికి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆకుపచ్చని తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోయినా.. పూర్తిగా మోడుబారి చనిపోయినా… అది పితృ దోషానికి సంకేతమట. అంటే ఆ ఇంటి యజమానికి అనారోగ్యం సంభవిస్తుందని తులసి మొక్క సూచిస్తుందట. అంటే ఏవైనా అనుకోని రోగాల బారిన పడతారని నమ్మకం. అంతే కాదండోయ్ ఉన్నట్టుండి తులసి మొక్క ఆకుల రంగు మారితే… ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థమట. ఎవరైనా గిట్టని వారు క్షుద్ర శక్తులు ప్రయోగించినప్పుడే తులసి ఆకులు రంగు మారుతాయని పెద్దలు వివరిస్తున్నారు. ఇలాంటప్పుడు మనం ముందుగానే జాగ్రత్త పడాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగల్గుతాం.ఇంట్లో ఉండే తులసి మొక్కను ప్రతి రోజూ పూజించడమే కాదు.. ఆ మొక్క ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
మొక్కలో మార్పులను ఎప్పటి కప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి. అంతే కాకుండా వాడిన పూలు లేదా మురికి నీటితో తులసి చెట్టును ఎప్పుడూ పూజించ కూడదు. ముఖ్యంగా తలసి ఆకులను గంగా జలంతో శుభ్రం చేయాలి. అయితే తులసి మొక్క అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందనే విషయం మన అందరికీ తెలిసిందే. ప్రతి రోజూ పూజ చేయగానే ఓ రెండు మూడు ఆకులను నోట్లో వేసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థను నియంత్రించడానికి తోడ్పడుతుంది. ఇంకా మానసిక వ్యాధులను దరి చేరనీయకుండా కూడా చూస్తుంది. మలేరియా, ఇతర రకాల జ్వరాల్లో తులసి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా చిన్న పిల్లలకు ప్రతి రోజూ రెండు తులసీ ఆకులను తినిపించడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. రాత్రి పూట తులసి విత్తనాన్ని ఒక గ్రాము పొడి నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాలు ఉత్పత్తి పెరుగుతుందట. మరి ఇంత మంచిని చేకూర్చే… తులసి మొక్కను మనం మరింత జాగ్రత్తగా చూసుకోవాలి.