Tulsi Puja : తులసి పూజ ఈ విధంగా చేశారంటే…. ఈ మంత్రాన్ని పఠిస్తూ ప్రదర్శనలు చేస్తే చాలు.
Tulsi Puja : మన హిందూ సాంప్రదాయాలలో తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. మన దేశ పురాణాలలో ఈ మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహిళలు ఉదయాన్నే లేచి తలంటి ఉతికిన దుస్తులను ధరించి పసుపు ,కుంకుమలను ఆచరించి తులసి మొక్కను పూజిస్తారు. హిందూ సంప్రదాయాలలో తులసి మొక్కకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటుంది. మహిళలు ఉదయం, సాయంత్రం తులసికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఈ మొక్కను లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. తులసిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లో నివాసమై ఉంటుందని నమ్మకం. తులసి అమ్మ వారిని పూజిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది. తులసి తీర్థాన్ని స్వీకరిస్తే సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. ఈ మొక్క 24 గంటలు ప్రాణవాయువు వదులుతూ ఉంటుంది. ప్రతిరోజు తులసి పూజ చేసే ముందు మొక్కకు నీరు పోయాలి. లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే తులసి మొక్కను పూజించ వలసిందే.
ఈ విధంగా తులసి మొక్కను పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసమై ఉండి మంచి ఆరోగ్యం, సంపద పొందుతారు. తులసి మొక్కకు నీరు పోసిన పిదప ప్రదక్షణలు చెయ్యాలి. ఈ మొక్కకు పూజ చేసేటప్పుడు ఎటువంటి మంత్రాన్ని జపించాలో తెలుసుకుందాం. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉండి ఆనందం ,శ్రేయస్సు కచ్చితంగా లభిస్తాయి. శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలను ధరించి ఆ తర్వాత తులసికి నీళ్లు పోయాలి. పూజ చేసిన తర్వాత తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షణాలు చెయ్యటానికి స్థలం అనుకూలంగా లేకపోతే మీరు నిలుచున్న స్థలంలోనే మూడుసార్లు నడవవచ్చు. ఈ మొక్కకు నీరు పోసిన తర్వాత ప్రదక్షణ చేయండి. అలాగే ఈ మంత్రాన్ని జపించాలి. లక్ష్మీదేవిని పద్ధతిగా పూజిస్తేనే అనుగ్రహం లభిస్తుంది. అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ కలుగును.
రాగి చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలను తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థిస్తూ పూజించాలి. నమస్తులసి కళ్యాణి! నమో విష్ణు ప్రియే! శుభే! నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే! బృందా బృందావని విశ్వ పూజిత విశ్వపావని! పుష్పసారా నందిని చ తులసి కృష్ణ జీవనీ! ఎతన్నామాష్టకం చైవ స్తోత్ర నామార్ధ సంయుతం య: పతెత్చాన్ చ సంపూజ్య షోశ్య మేధాఫలం లభేతు అని తులసమ్మ తల్లి నీ ప్రార్ధించి, అచ్యుతానంద గోవిందా అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి . ఆ తర్వాత కింద స్లోకాన్ని చదవాలి.యన్ములే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవతా: యదగ్రే సర్వ వేదార్చ తులసీన్ త్వాన్ నమామ్యహం అని రాగి చెంబులోని నీరును తులసమ్మ తల్లికి పోసి నమ్మ స్కరించాలి. తులసి శ్రీ సఖి సుబే పాప హరిణి పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణ మన: ప్రియే అని తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్కని పెంచండి.