Vastu Tips : వాస్తు ప్రకారంగా ఇంటికి డోర్ బెల్ ను ఎక్కడ అమర్చాలో తెలుసా…
Vastu Tips : ప్రతి ఒక్కరు తమ గృహాన్ని వాస్తు ప్రకారంగా నిర్మించుకుంటారు. అలాగే ఇంట్లోని ప్రతి వస్తువుని కూడా వాస్తు ప్రకారంగా నిర్మించుకుంటే ఎలాంటి దోషాలు ఉండవని వాస్తు శాస్ర్త నిపుణులు అంటున్నారు. వాస్తు నియమాలను పాటించకపోతే జీవితంలో అనేక దుర్ఘటలను ఎదుర్కోవాల్సి వుంటుంది. అలాగే ఇంట్లోని వారు మానసికంగా, ఆర్ధికంగా, ఆరోగ్యంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వుంటుంది. అందుకే ఇంట్లో అమర్చే ప్రతి వస్తువు వాస్తు ప్రకారంగా ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా కొంతమంది ఇంటికి డోర్ బెల్ ను అమర్చుకుంటారు.
కాని దానిని వాస్తు ప్రకారంగా కాకుండా తమకు అనుకూలంగా ఉన్నచోట అమర్చుకుంటారు. దానివలన ఇంట్లో దుష్పలితాలు ఎదురవుతాయి. ఇప్పుడు ఇంటికి డోర్ బెల్ ను ఎక్కడ అమర్చుకోవాలో తెలుసుకుందాం… డోర్ బెల్ ను అమర్చుకోవడం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా ఉంటుందని కొందరి నమ్మకం. చాలామంది ఇళ్లల్లో ప్రధాన ద్వారానికి పెట్టాల్సిన డోర్ బెల్ అమర్చడంలో తప్పులు చేస్తుంటారు. వాస్తు ప్రకారంగా , డోర్ బెల్ ను నేమ్స్ ప్లేట్ పైన అమర్చాలి. ఇలా అమర్చడం వలన కుటుంబంలోని పెద్దలకు పేరు ప్రతిష్టతలను పెంచుతుంది. అలాగే మెయిన్ డోర్ మీద డోర్ బెల్ ను ఎంత ఎత్తులో అమర్చాలో కూడా వాస్తు శాస్ర్తంలో చెప్పబడింది.

Vastu Tips for wear the door bell in our home
కనీసం ఐదు అడుగుల ఎత్తులో అమర్చుకోవాలని వాస్తు శాస్ర్తం చెప్తుంది. దీనివలన ఒక ప్రయోజనం కూడా వుంది. అది ఏమిటంటే పిల్లలు పదే పదే డోర్ బెల్ ను రింగ్ చేయరు. ఇంటి డోర్ బెల్ గా గంట శబ్ధాన్ని ఏర్పాటు చేస్తారు. దీనివలన ప్రతికూల శక్తి ఇంట్లోకి రాకుండా వుంటుంది. అలాగే బిగ్గరగా సౌండ్ వచ్చే డోర్ బెల్ మంచిది కాదు. మధురంగా వాయిస్ వచ్చే డోర్ బెల్ ను అమర్చుకోవడం శుభప్రదమని వాస్తు శాస్ర్త నిపుణులు అంటున్నారు. అలాగే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు డోర్ బెల్ లేకపోతే తలుపులను తడుతారు. అలా తలుపులను తట్టడం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. దీనివలన ఇంట్లోని వారికి చెడు ఫలితాలు ఎదురవుతాయి. కనుక వీలైనంతవరకు డోర్ బెల్ ను అమర్చుకోవడానికి ప్రయత్నించండి.