Vastu Tips : ఈ దిక్కున రాగి సూర్యుడు ని పెట్టుకుంటే సకల శుభాలు, మీ ఇంటి ఆర్థిక సమస్యలకు పరిష్కారం…!!
Vastu Tips : చాలామంది ఇంటిముందు ఎన్నో రకాల దిష్టిబొమ్మలను అలాగే కొన్ని దేవుడి ఫోటోలను రకరకాలుగా పెడుతూ ఉంటారు. అయితే సూర్యుడి బొమ్మ పెట్టుకుంటే అన్ని సకల శుభాలే జరుగుతాయని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. సూర్యుడు భూమి అంతట చీకటిని పారద్రోలి వెలుగుని నింపుతూ ఉండాలి. సూర్యుని దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో ఎంతోమంది ఒత్తిడి ఇతర రకాల ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు. ఒత్తిడికి ఎన్నో కారణాలు ఉంటాయి. అలాగే ఇంట్లో రోజువారి అప శత్రువులు, డబ్బు లేకపోవడం, పురోగతి లేకపోవడం లాంటి ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉంటారు. కొన్నిసార్లు ఈ రకమైన ఇబ్బంది ఇంటి వాస్తు దోషాల వల్ల కూడా వస్తుంటాయి.
కాబట్టి చాలామంది ఇల్లు కట్టేటప్పుడు వాస్తుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉంటారు. అయితే రాగి లోహంతో చేసిన సూర్యున్ని ఇంట్లో ఈ దిక్కున పెట్టడం వలన సూర్య భగవానుడి ఆశీర్వాదం కుటుంబానికి చెందుతుంది. అలాగే సానుకూల శక్తి ఆ ఇంట్లో ప్రవేశిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. విశ్వాసాల ప్రకారం రాగి లోహం సూర్యుడు అంగకారక గ్రహానికి సంబంధించినది అయితే మీ ఇంటి బాల్కనీలో రాగి సూర్యుడు ప్రతిమను పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం బాల్కనీకి తూర్పు దిశలో రాగి సూర్య ని పెట్టడం వల్ల అంత శుభాలే జరుగుతాయి. ఈ విధంగా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. రాగి లోహపు సూర్యుడు విగ్రహం ఇంటికి తూర్పు దిశలో మాత్రమే పెట్టాలి.
కానీ దాని ముందు కిటికీ లేదా రహదారి లేని ప్రదేశంలో పెట్టుకోవాలి. దాని శక్తి కారణంగా ఇంట్లో వ్యక్తుల మధ్య సంబంధాలు మధురంగా మారుతాయి. మీరు మీ ఇంటి కార్యాలయంలో రాగి సోలార్ ప్రతిమనుపెట్టడం వలన ఇది మీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తుంది. మీరు మీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే త్వరలో ఉద్యోగం కూడా వస్తుంది. సూర్యుడు భూమి అంతట చీకటిని పారద్రోలి వెలుగుని తీసుకొస్తాడు. అందుకే భక్తులు సూర్యున్ని దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం రాగి సూర్యుడు నలుపు రంగులో ఉన్న చీకటిని పారద్రోలి కాంతి రూపంలో ఆనందాన్ని ఎదజల్లుతూ ఉంటాడు. అందుకే ఇంట్లో ఈ ప్రతిమను తూర్పు దిశలో పెట్టుకోవాలి.