Vastu Tips : బుద్ధ విగ్రహాన్ని ఇక్కడ పెట్టారంటే… అదృష్టం వరిస్తుంది…
Vastu Tips : ఇంటి ముఖ ద్వారం దగ్గర బుద్ధుడి విగ్రహం పెడితే బయట నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ని ఆపుతుంది. పైగా బుద్ధుడి విగ్రహం అక్కడ ఉంచడం వలన దీవించినట్లు కూడా అవుతుంది. అలాగే అందంగా కూడా కనబడుతుంది. అయితే ముఖ ద్వారం వద్ద బుద్ధ విగ్రహం పెట్టేటప్పుడు దానిని నేలమీద నుండి మూడు నాలుగు అడుగుల దూరంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడు కూడా నేలపైన బుద్ధ విగ్రహాన్ని పెట్టకూడదు. అయితే వాస్తు ప్రకారం బుద్ధుడి విగ్రహాన్ని పడమర దిక్కున ఉంచడం మంచిది. ఇది శాంతిని నెలకొల్పుతుంది. ఎప్పుడైనా సరే బుద్ధ విగ్రహాన్ని శుభ్రమైన టేబుల్ లేదా సెల్ఫ్ లో ఉంచాలి. బుద్ధుడి విగ్రహం లివింగ్ రూమ్ లో పెట్టిన ప్రశాంతత కలుగుతుంది.
ఇంకా గార్డెన్లో బుద్ధుడి విగ్రహాన్ని ఉంచవచ్చు. అయితే బుద్ధుడి విగ్రహం మెడిటేషన్ చేస్తున్నట్లుగా ఉంటే బాగుంటుంది. గార్డెన్లో ఒకపక్క దానిని ఉంచాలి. ఇది మీకు మంచి కలిగేటట్టు చేస్తుంది. బుద్ధుడి గ్రహాన్ని పెట్టేటప్పుడు మంచి సువాసన వచ్చే కొవ్వొత్తులు, స్టిక్స్ ని వెలిగించవచ్చు. దీనివల్ల ఎంతో ప్రశాంతత ఉంటుంది. చాలామంది పూజ గదిలో బుద్ధుడిని పెట్టి పూజిస్తూ ఉంటారు. ఇది కూడా చాలా మంచి పాజిటివ్ ఇస్తుంది. అదేవిధంగా మెడిటేషన్ చేసే చోట గనుక బుద్ధుడి విగ్రహాన్ని పెడితే ఏకాగ్రత మరింత పెరుగుతుంది. తూర్పు వైపు కూడా బుద్ధ విగ్రహం పెట్టవచ్చు. బుద్ధుడి విగ్రహం ఇంట్లో ఉండడం వలన మానసిక ఆరోగ్యం మరియు శాంతి కూడా ఉంటుంది. బుద్ధుడి విగ్రహాలు చాలా రకాలుగా ఉంటాయి.
ఒకవేళ కనుక మీ పిల్లలు చదువు పట్ల ఆసక్తి పొందాలంటే చిన్న బుద్ధుడు తలని వాళ్ళ గదిలో ఉంచాలి. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది. బుక్ సెల్ఫ్ లేదా గ్లాసు సెల్పు పైన బుద్ధ విగ్రహం లేదా లాఫింగ్ బుద్ధ అని పెట్టవచ్చు. అయితే లాఫింగ్ బుద్ధ బుద్ధుడి విగ్రహం రెండు ఒకటి కాదు కానీ రెండు ఆనందాన్ని తీసుకువస్తాయి. అలాగే ప్రశాంతంగా ఉంచుతాయి. కనుక వీటిని ఇంట్లో ఉంచినా కూడా మంచిది. అయితే పుస్తకాల సెల్ప్ మీద పెట్టినప్పుడు తూర్పు వైపు ఉండేటట్లు చూసుకోవాలి. ఇట్లు వాసు ప్రకారం బుద్ధుడి విగ్రహాలను ఇలా పెట్టడం వలన ఇంట్లోని వారు ఆనందంగా జీవిస్తారు. అలానే అన్ని సమస్యలు దూరం అవుతాయి.