Vastu Tips : ఈ నియమాలు పాటిస్తే మీ ఇంటిలో డబ్బు నిలుస్తుంది.. లేదంటే అంతే సంగతులు..
Vastu Tips : ప్రపంచంలో ఏ పని జరగాలన్నా డబ్బు చాలా ముఖ్యమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ‘ధనం మూలం ఇదం జగత్’ అని పెద్దలు అన్నారు. డబ్బు ద్వారా ప్రపంచం నడుస్తుంది. కాబట్టి ఆ మనీ సంపాదించేందుకుగాను జనం కష్టపడుతుంటారు. కాగా, కొన్ని సార్లు డబ్బు వచ్చినప్పటికీ ఇంటి లోపల నిలవకపోవడం మనం చూస్తుండొచ్చు. అటువంటి వారు వాస్తు నిపుణులు చెప్పినట్లు ఈ నియమాలు పాటిస్తే కనుక ఇంటి లోపల డబ్బు నిలువడంతో పాటు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆ నియామాలేంటో తెలుసుకుందాం..
ప్రతీ ఒక్కరికి డబ్బు చాలా ముఖ్యం. కాగా, సంపాదించిన సురక్షితంగా భద్రపరుచుకోవడం కూడా అవసరం. అలా సంపాదించుకున్న డబ్బును దాచుకుంటేనే భవిష్యత్తులో మన అవసరాలకు ఉపయోగించుకోవచ్చును. ఇకపోతే వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంటి లోపల పలు విషయాల పట్ల జాగ్రత్త వహించనట్లయితే అది డబ్బు పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇంట్లో పలు నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇంటి లోపల లాకర్ ఉంచే దిశ కూడా మీ అదృష్టంపైన ప్రభావం చూపుతుంది. కాబట్టి డబ్బుకు లోటు రాకుండా ఉండాలంటే కనుక కంపల్సరీగా ఈ వాస్తు చిట్కాలను ఫాలో కావాల్సి ఉంటుంది.ఇంటి లోపల ఉండే లాకర్‌ను నైరుతి దిశలో ఉంచాలి. అలా చేయడం ద్వారా ఖజానాకు స్థిరత్వం ఏర్పడుతుంది.
Vastu Tips : ఈ చిట్కాలతో డబ్బులు సురక్షితం..
లాకర్ తలుపు పశ్చిమ దిశలో ఎప్పుడు ఓపెన్ చేయకూడదన్న సంగతి గుర్తెరగాలి. ఒకవే ళ అలా ఓపెన్ అయి ఉంటే కనుక ఇబ్బందులే తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇకపోతే మీ ఇంటి లోపల ఉండే నగదు, కార్డులను ఎప్పుడూ ఉత్తర దిశలో ఉంచుకోవాలి. అలా అయితేనే మీకు రక్షణ ఉంటుంది. ఉత్తర దిశలో ఒక ప్లేస్ ఎంచుకుని ఎప్పుడూ అక్కడే మనీని స్టోర్ చేయాలి. అలా అయితేనే మీకు ఎటువంటి ఇబ్బందులు రావు. ప్రతీ రోజు డబ్బును అక్కడే స్టోర్ చేయాలి. వాస్తు ప్రకారం.. డబ్బును నాలుగు లే దా ఐదు చోట్లలో అస్సలు పెట్టొద్దు. అలా చేయడం ద్వారా ఇబ్బందులే వస్తాయి. హౌజ్ ఎంట్రీ పాయింట్ నుంచి చూస్తే నగదు పెట్టె కనబడుకుండా జాగ్రత్త వహించాలి.