Venu Swamy : 2025 లో అష్టమ శని ప్రభావం… ఈ రాశి వారికి నరకం తప్పదు అని వేణు స్వామి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : 2025 లో అష్టమ శని ప్రభావం… ఈ రాశి వారికి నరకం తప్పదు అని వేణు స్వామి..!

 Authored By ramu | The Telugu News | Updated on :11 December 2024,9:00 am

Venu Swamy : 2025వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉండబోతుందో జ్యోతిష్య పితామహుడు అయిన వేణు స్వామి వెల్లడించారు. ఈ ఏలినాటి శని ప్రభావం సింహ రాశి పై ఎక్కువగా ఉందని, ఈ సింహ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖా నక్షత్రం 1,2,3,4పాదాలు,అలాగే ఉత్తరా నక్షత్రం,1 వ పాదం వారు సింహ రాశి జాతకులు.

Venu Swamy సింహరాశి వారికి 2025 జాతకం ఎలా ఉండబోతుంది

ఈ సింహ రాశి వారికి ఈ సంవత్సరం,ఆదాయం 11,వ్యాయం 11, రాజ్య పూజ్యం 3, అవమానం 6 గా ఉండబోతుంది. ఈ సంవత్సరం అంతా సింహ రాశి జాతకులకు అష్టమ శని యొక్క ప్రభావం ఉండబోతుంది. కావున వీరు అనేక ఇబ్బందు లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున వీరు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎక్కడైనా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. గొడవలు వచ్చి పడతాయి. శత్రువుల బాధ పెరిగిపోతుంది.విదేశాలలో ఉన్న విద్యార్థులు వీసా రిజెక్ట్ కావడం తిరిగి స్వదేశానికి రావటం, ఉత్తీర్ణశాతం తగ్గటం, ఫెయిల్ కావటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.

Venu Swamy 2025 లో అష్టమ శని ప్రభావం ఈ రాశి వారికి నరకం తప్పదు అని వేణు స్వామి

Venu Swamy : 2025 లో అష్టమ శని ప్రభావం… ఈ రాశి వారికి నరకం తప్పదు అని వేణు స్వామి..!

Venu Swamy ఈ సింహ రాశి వారి కష్టాలు, అడుగడుగున వీరి నష్టాలు

అష్టమ శని యొక్క ప్రభావం సింహరాశి విద్యార్థులపై మానసిక ఇబ్బందులను తెచ్చిపెడుతుంది.మనశ్శాంతి లేక అశాంతికి గురవుతారు. విదేశాలలో ఉన్న విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగం రాక నరకాన్ని చూస్తారు. స్నేహితులే శత్రువులు అయ్యే అవకాశం ఉంది. ఎవరినైతే బాగా నమ్ముతారు వారే మోసం చేసే అవకాశం ఉంది.ఊహించిన విధంగా ఈ సంవత్సరం దగ్గరి వారితో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వచ్చిందంటేనే గొడవలు తోటి మన ఈ జీవితం గడిచిపోతుంది. శత్రువుల బాధ ఎక్కువైపోతుంది.అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు త్రియే భ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

Venu Swamy ఉద్యోగులకు ఈ ప్రమాదం

కుటుంబంలో దగ్గర వారు ఈ సంవత్సరం మరణించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఏమాత్రం కలిసి రాదు.ట్రాన్స్ఫర్ ఉద్యోగంలో అనుకున్న ప్రదేశానికి జరగవు. ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండవు.పై అధికారుల ఒత్తిడి పెరిగిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి వాళ్లకు ఏసీబీ రైట్స్ అయ్యే అవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ లు ఏసీబీ, సిబిఐ, ఈడి లాంటి కేసులలో చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Venu Swamy రూపాయి రూపాయి వస్తే పది…. జాగ్రత్త..!

ఈ సింహ రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల సినిమా రంగంలో ఉండే వారికి చాలా అనుకూలంగా ఉంది. నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. కానీ ఆర్థికంగా రూపాయి వస్తే పది రూపాయల ఖర్చు ఈ సంవత్సరం సింహరాశి వారoదరికీ కనిపిస్తుంది. ఈ సింహ రాశి వారు డబ్బు ఖర్చు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి ఖర్చు పెట్టవలసి ఉంటుంది. డబ్బుని చాలా పొదుపు చేసుకోవాలి. పోలీసులు, కోర్టు కేసులతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే రైతులకు ఈ సంవత్సరం దిగుబడి రాబడి తక్కువగా ఉండే అవకాశం ఉంది.

రాజకీయ నాయకులు బి కేర్ఫుల్

క్రీడాకారులకు మీకు రాజకీయాల వల్ల అవకాశాలు దక్కకపోవచ్చు. రాజకీయ నాయకులకు సంబంధించి చాలా నెగిటివ్గా ఉండే పరిస్థితి ఉంది. డబ్బు విపరీతంగా ఖర్చయిపోతుంది. కానీ అనుకున్నా పదవులు ఏమి దక్కకపోవచ్చు. ఈ సంవత్సరం పోటీ చేసేవారు ఓడిపోయే అవకాశం ఉంది. అంతేకాక అపవాదులు, అపనిందలపాలు అవుతారు. చాలా జాగ్రత్తగా ఉండండి.

సింహ రాశి వారు ఈ పరిహారాలు చేయండి

సింహరాశి జాతకులు శనివారం నియమాన్ని పాటించండి. శనివారం పూట రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండండి. వీలైతే శనివారం నాడు బ్లూ కలర్ దుస్తులను వేసుకుని ప్రయత్నం చేయండి. నల్లని రంగు దుస్తులను వేయకూడదు. అలాగే గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి. వీలైతే శనివారం నాడు నవగ్రహాలలో శని గ్రహముకి పూజలు చేయండి. ఇలా చేయటం వల్ల వేరుకు కొంతవరకు సమస్య తీవ్రత తగ్గుతుంది. అలాగే తిరునల్లార్ శనీశ్వరాలయం ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించుకుంటే అష్టమ శని వల్ల కలిగే సమస్య నుండి బయటపడతారు. శని ప్రభావం ఉండకూడదు అనుకుంటే నీతి నిజాయితీతో జీవించడం అలవాటు చేసుకోవాలి. అసత్యమును పలకకూడదు. ఎవరిని ఊరికే దూషించకూడదు. అహంకారం చూపించకూడదు. అందరి మీద ప్రేమ ప్రేమాభిమానాలు చూపిస్తూ సఖ్యతను కలిగి ఉండాలి. చిన్న పెద్ద మర్యాదలను ఇవ్వాలి. దానధర్మాలు చేయాలి. అన్ని చేస్తే కొంతవరకు అష్టమి శని ప్రభావం తగ్గుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది