Venu Swamy : వృషభ రాశి వారికి అన్ని విధాల అదృష్ట సంవ‌త్స‌రం 2025 : వేణుస్వామి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : వృషభ రాశి వారికి అన్ని విధాల అదృష్ట సంవ‌త్స‌రం 2025 : వేణుస్వామి

 Authored By ramu | The Telugu News | Updated on :4 December 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : వృషభ రాశి వారికి అన్ని విధాల అదృష్ట సంవ‌త్స‌రం 2025 : వేణుస్వామి

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామి 2025 సంవత్సరంలో వివిధ రాశుల‌ వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో వెల్ల‌డించారు. అయితే వృషభ రాశి వారి జాతకాన్ని ఉద్దేశించి ఆయ‌న పేర్కొంటూ ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని విధాలుగా అదృష్ట సంవత్సరం అని తెలిపారు.

Venu Swamy పట్టిందల్లా బంగారం..

వృషభ రాశి కృత్తికా 2,3,4 పాదాలు, రోహిణి 1,2,3,4 పాదాలు, మృగశిర 1,2 పాదములలో పుట్టిన వారు వృషభ రాశి వారు. 2025 సంవత్సరం వృషభ రాశి జాతకులకు ఆదాయం 11, వ్యయం 5 , రాజపూజ్యం 1, అవమానం 3. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గురు బలం, శని బలం, రాహు కేతువుల బలం అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం వీరు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది.

Venu Swamy వృషభ రాశి వారికి అన్ని విధాల అదృష్ట సంవ‌త్స‌రం 2025 వేణుస్వామి

Venu Swamy : వృషభ రాశి వారికి అన్ని విధాల అదృష్ట సంవ‌త్స‌రం 2025 : వేణుస్వామి

Venu Swamy పాత‌ కష్టాలకు చెక్..

ఏడేండ్లుగా శని కారణంగా ఇబ్బంది పడుతున్న వీరి కష్టాలు తొలగిపోనున్నాయి. 2025 సంవత్సరం ఊహించని ధన లాభాలను ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది. స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం సిద్ధిస్తుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు వస్తాయి.

Venu Swamy విద్యార్థులకు, ఉద్యోగులకు ఇలా..

విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. పోటీ ప‌రీక్ష‌ల్లో మార్కులు ఎక్కువగా వస్తాయి. కోరుకున్నవిద్యా సంస్థ‌ల్లో సీట్లు దొరుకుతాయి. ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇతర దేశాలకు వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు 2025 సంవత్సరం వంద శాతం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు 2025 సంవత్సరం పరిపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది.

రైతులకు, కళాకారులకూ.. : సంఘంలో సమాజంలో మంచి పేరు వస్తుంది. అలాగే రైతులకు ఈ సంవత్సరము రెండు పంటల దిగుబడి పూర్తిస్థాయిలో ఉంటుంది. పూర్తి దిగుబడితో పాటు రాబడి పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. శుభకార్యాలు చేస్తారు. ఇల్లు కానీ, భూములు కానీ కొనుగోలు చేస్తారు. రైతులకు సంబంధించి, కళాకారులకు సంబంధించి కచ్చితంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే అవార్డులు రివార్డులు వస్తాయి.

ఆరోగ్యం సంరక్షణ.. : ఈ సంవత్సరం మీ ఆరోగ్యాన్ని విస్మరించడానికి సమయం కాదు. గ్రహణ కాలం మీ ఆరోగ్య రంగాలపై లేదా దాచిన సమస్యలపై ప్రభావం చూపనప్పటికీ, మీరు ఉత్తమంగా కనిపించాలని మరియు అనుభూతి చెందాలని కోరుకుంటారు.

ఇబ్బందులు వస్తే ఇందువల్లే : 2025 సంవత్సరం వృషభ రాశి జాతకులు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమైనా సమస్యలు తెచ్చుకుంటే తెచ్చుకునే అవకాశం ఉంది. తప్ప వృషభ రాశి జాతకులకు 2025 సంవత్సరం పూర్తిగా అనుకూలంగా ఉండేటువంటి సంవత్సరంగా భావించాల్సి ఉంటుంది. Taurus, Astrologer, zodiac sign, venu swamy, Astrologer venu swamy

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది