భర్తను పేరు పెట్టి పిలవకూడదా.. పిలిస్తే ఏవుతుంది?
మన హిందూ సంప్రదాయాల ప్రకారం భర్తను పేరు పెట్టి పిలవకూడదని.. మన పెద్దలు తరచుగా చెప్తుంటారు. కానీ ఈ కాలం పిల్లలు పేరు పెట్టే పిలుస్తున్నారు. అంతేనా బేబీ, బుజ్జి.. ఇలా సవాలక్ష ముద్దు పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. అంతేనా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు, ఒకే దగ్గర పెరిగిన బావా మరదళ్లు వంటి వాళ్లు అయితే భర్తను అరేయ్, ఒరేయ్ అని కూడా పిలుస్తున్నారు. కానీ ఇదంతా మన సంప్రదాయం కాదని… అసలు పేరు పెట్టి పిలవడమే భావ్యం కాదని మన పెద్దలు చెబుతున్నారు. అసులు భర్తను పేరు పెట్టి ఎందుకు పిలవకూడదు, పిలిస్తే ఏమవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఏవండీ.. మిమ్మల్నే మీరూ, తమరూ… ఇలా భార్య భర్తను సంబోధిస్తుండటం సహజం. కానీ కొంత మంది వారి వారి పేర్లతోను పిలుస్తుంటారు. మనం ఏది ఆచరించినా, ఇతిహాసాలు, పురాణాలు, ప్రకారమే సహజీవనం సాగిస్తుంటాం. భర్త భార్యను తండ్రి వంశంతో కూడా సంభోదిస్తుంటాడు. ఉదాహరణకు శ్రీరాముడు సీతను జనకరాజ పుత్రీ అని కూడా పిలుస్తాడు. అలాగే భార్య కూడా పిలవచ్చు. సీతాదేవి శ్రీ రాముడ్ని ఎన్నో సార్లు పేరు పెట్టి పిలిచింది. అది ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే. భర్తను పేరు పెట్టి పిలవడం మన హిందూ కానే కాదు. వినే వాళ్లకి ఆ భర్త మీద ఉండాల్సిన గౌరవం ఉండదు. అలాగే లాటి తోటి స్త్రీలలో కూడా ఆ స్త్రీ ఒకింత లోకువే అవుతుంది.
అందుకే మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీ భర్తను ఏమైనా అనొచ్చు కానీ.. ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం ఏమీ అనకూడదు. ముద్దు పేర్లు, తిట్టడాలు వాంటివి కూడా చేయకూడదు. పేరు కూడా పెట్టి పిలవకూడదు. ముఖ్యంగా అత్తింటి వారి ముందు, మీ అమ్మ వాళ్ల ఇంటి ముందు అలా అస్సలే చేయకూడదు. ఒక వేల ఇప్పటి వరకైనా అలా చేస్తే… ఇక మీదట అయినా జాగ్రత్తగా ఉండండి. మరిచిపోయి కూడా మీ భర్తను పేరు పెట్టి పిలవకండి. ఏవండి, మీరు, మన పక్కన ఎవరైనా ఉంటే వాళ్లకు మీ వారు వసరకు ఏమవుతారోఆ వరసతో పిలవమని చెప్పాలి.