Pasupu Kumkuma : పసుపు, కుంకుమలు కింద పడితే అపచారామా.. ఏం చేయాలి?
Pasupu Kumkuma : హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతీ ఒక్క హిందువు బొట్టు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఫ్యాషన్ అంటూ చాలా మంది ప్రతి రోజూ బొట్టు పెట్టుకోకపోయినప్పటికీ… పూజలు, పునస్కారాలు చేసేటప్పుడు మాత్రం కచ్చితంగా బొట్టు పెట్టుకుంటారు. అయితే చాలా మంది ఆడవాళ్లు స్నానం చేయగానే లేదా ఇంట్లో దీపారాధనకు ముందు లేదా సాయంత్రం దీపాలు వేసే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుంటుంటారు. అయితే అలాంటి సమయంలో కుంకుమ చేజారిపోతే ఏదైనా అరిష్టం జరిగిపోతుందోమోనని భయపడిపోతారు. తన భర్తలకు, తమ పసుపు, కుంకుమలకు ఏమైనా అయిపోతుందేమోనని తెగ టెన్షన్ పడిపోతుంటారు. కానీ పసుపు, కుంకుమలు పొరపాటున చేజారిపోతే ఎలాంటి సమస్యా ఉండని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఆడవాళ్లు బొట్టు పెట్టుకుంటునప్పుడో, పెడుతున్నప్పుడో లేదా గడపపై పసుపు, కుంకుమలతో ముగ్గు వేస్తున్నప్పుడో… పసుపు, కుంకమలు చేజారిపోతే ఎలాంటి అశుభం జరిగదని చెబుతున్నారు.ఎప్పుడైనా పసుపు, కుంకుమలు పొరపాటున చేజారి కింద పడిపోతే… అపశకునం అనుకోవడం మన మానసిక బలహీనతే తప్ప మరెలాంటి అపశకునం కాదని చెబుతున్నారు. అంతే కాదండోయ్ మనకు తెలియకుండానే కింద పడిపోయిన పసుపు, కుంకుమలను భూదేవికి సమర్పించినట్లుగా భావించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరిస్తున్నారు. నిజానికి మనం చాలా ఆలయాల్లో మెట్ల పూజలు చేస్తూ ఉంటాం. అయితే అందరూ నడిచే మెట్లపై పూజలు చేయడం మనం భూదేవికి పూజ చేసినట్లుగా భావిస్తాం. అంతే కాకుండా పసుపు, కుంకుమలను మెట్లపై పెడుతూ… ఎంతో భక్తి, శ్రద్ధలతో ఆ భూదేవికి పూజ చేస్తాం.
అనుకోకుండా చేజారిపోయిన పసుపు, కుంకుమలు కూడా ఆ భూదేవి చెంతకే చేరుతాయి.అలా జారిపోయిన వాటిని కూడా భూతల్లికి సమర్పించినట్లుగా భావించాలని పురాణాలు చెబుతున్నాయి. పసుపు, కుంకుమ చేజారితే మనకే పుణ్యం లభిస్తుంది. అంటే ఆ భూతల్లికి సమర్పించినట్లుగా భావించి… నమస్కారం చేయాలి. అంతా నీ దయే తల్లి అంటూ భూమాతను వేడుకోవాలి. ఇలా చేడయం వల్ల అనుకోకుండానే అమ్మవారికి పూజ చేసినట్లు అవుతుంది. అయితే అలా కిందపడిపోయిన పసుపు, కుంకుమలను మాత్రం మనం పెట్టుకోకూడదు. అలాగే వేరే వాళ్లకు కూడా పెట్టకూడద. భూదేవికి చెందినది ఆమెకు వదిలేయాలని పెద్దలు చెబుతున్నారు.