Raksha Bandhan : 11 లేదా 12 తారీఖుల్లో ఎప్పుడు సోదరులకు రాఖీ కట్టాలో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raksha Bandhan : 11 లేదా 12 తారీఖుల్లో ఎప్పుడు సోదరులకు రాఖీ కట్టాలో తెలుసా…?

 Authored By aruna | The Telugu News | Updated on :5 August 2022,6:30 am

Raksha Bandhan : శ్రావణమాసం మొదలుకాగానే అన్ని రకాల పండుగలు మొదలైనట్టే. అందులో ఈ నెలలో జరుపుకునే పండగలో ఒకటి రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజు వస్తుంది. ఈ పౌర్ణమి రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి దీర్ఘాయుష్షును కోరుకుంటారు. అలాగే సోదరుడు తన సోదరిని జీవితాంతం కాపాడతానని వాగ్దానం చేస్తాడు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు సంవత్సరం అంతా రక్షాబంధన్ పండుగ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఈ సంవత్సరం పౌర్ణమి ఘడియలు రెండు రోజులు వచ్చాయి. ఈనెల పౌర్ణమి 11వ తేదీన మొదలై 12వ తేదీన పూర్తవుతుంది. దీంతో రాఖీ పండుగ ఆగస్టు 11న జరుపుకోవాలా లేక ఆగస్టు 12న జరుపుకోవాలా అని సందేహిస్తున్నారు. అయితే రక్షాబంధన్ పండుగను ఎప్పుడు, ఏ శుభ సమయంలో జరుపుకోవాలి అని ప్రముఖ జ్యోతిష్యులు పండిట్ రమేష్ సెమ్వాల్ తెలిపారు.

జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం ఈ సంవత్సరం రాఖీ పండుగను ఆగస్టు 11, 2022న జరుపుకోవాలని చెప్పారు. 11వ తేదీ గురువారం పౌర్ణమి మధ్యాహ్నం భద్ర దోషం ఉంది. పంచాంగం ప్రకారం ఆగస్టు 11, 2020 సూర్యోదయం సమయంలో చతుర్దశి తిధి ఉంది. అంతే కాదు గురువారం రోజు పౌర్ణమి తిది ఉదయం 10:58 నుండి ప్రారంభం కానుంది. దీనితో భద్రదోషం ఆరోజు రాత్రి 08:50 వరకు ఉంటుంది. భద్రకాలంలో పర్వదినాలు జరుపుకోవడం శాస్త్రంలో నిషేధించారు. కనుక రాత్రి 8:50 గంటల తర్వాత మాత్రమే రాఖీ కట్టడం శుభప్రదం అని తెలిపారు. కాబట్టి సోదరీమణులు రాత్రి 8:50 తర్వాత తమ సోదరులకు రాఖీ కట్టవచ్చని తెలిపారు.

When do raksha bandhan in 11 or 12 August 2022

When do raksha bandhan in 11 or 12 ,August ,2022

రాఖీ పౌర్ణమి రోజు సోదరుడికి సోదరి రాఖీ కట్టే ముందు తలస్నానం చేయాలి. ఒక పళ్లెంలో కుంకుమ, చందనం, అక్షింతలు, పెరుగు, స్వీట్లు, స్వచ్ఛమైన నెయ్యి దీపం, దారం లేదా పట్టు లేదా పత్తితో చేసిన రాఖీతో అలంకరించాలి. ఆ తర్వాతే సోదరుడిని తూర్పు లేదా ఉత్తరం వైపు మొఖం ఉండేలా కూర్చోబెట్టాలి. తర్వాత సోదరుడికి కుంకుమ పెట్టి కుడి చేతి మణికట్టుపై రాఖీని కట్టాలి. అనంతరం సోదరుడికి స్వీటును తినిపించాలి. తన అన్నదమ్ములకు బంగారు భవిష్యత్తు ఉండాలని దీర్ఘాయుష్షుతో జీవించాలని సోదరి కోరుకుంటూ తమ అన్నకి కానీ తమ్ముడికి కానీ నిండు మనసుతో ఆశీర్వదిస్తూ రాఖీని కట్టాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది