Shravana Masam : శ్రావణమాసంలో ఆడవాళ్లు ఈ నాలుగు వస్తువులను అస్సలు దానం చేయకూడదు…!
Shravana Masam : శ్రావణ మాసంలో స్త్రీలు ఈ పనులు అస్సలు చేయకూడదు. అలాగే ఈ వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలా చేస్తే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మరి శ్రావణమాసంలో ఆడవాళ్లు అస్సలు దానం చేయకూడని ఆ వస్తువులేంటో తెలుసుకుందాం. ఇక విషయాలకు వెళ్తే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. అంటుంటారు పెద్దలు. రక్తదానం కూడా గొప్పదే దానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. అందుకే చాలామంది తమకు తోచింది దానం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎవరైనా అవసరంలో ఉన్న ఆపదలో ఉన్న వాళ్లకు సాయం చేస్తే దాన్నే దానం అంటారు.
చాలా మంది అన్నదానం చేస్తుంటారు నీలదానం చేస్తుంటారు. వస్త్రాలు దానం చేస్తుంటారు. ఏవైనా వస్తువులు కూడా దానం చేస్తుంటారు. ఇలా తమకు తోచిన ధానం చేస్తుంటారు. శనివారాల్లో నూనెను దానం చేస్తారు. చాలామంది అలా దానం ఇవ్వడం వల్ల వాళ్ల దరిద్రం పోతుందని భావిస్తారు. మీరు ఉపయోగించిన నూనెను ఎవరైనా దాతృత్వం కోసం ఇచ్చినట్లయితే అది ఎటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉండదు. అలాగే ఇది వ్యతిరేక ఫలితాలను తెస్తుంది. దానం ఎప్పుడూ అవతలి వ్యక్తికి ఉపయోగపడేదిగా ఉండాలి. స్టీల్ పాత్రలను దానం చేయకూడదు. ముఖ్యంగా మీ ఇంట్లో ఉంచిన పాత్రలు వాటి దానానికి దూరంగా ఉండాలి.
అలాగే చీపురు, ఉప్పు, కారం ,ఇనుము ఎప్పుడు దానం ఇవ్వకూడదు. ఈ విధంగా దానం చేసినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తాయి. అలాగే అనారోగ్య పాలవుతారు. కాబట్టి ఆడవారు ఈ వస్తువులను ఎప్పుడు దానం ఇవ్వకండి. ఏ దానం చేసిన ఏ పూజ చేసిన భక్తి శ్రద్ధలతో చేయండి. ఆకలి అన్నవారికి పట్టెడు అన్నం పెడితే అదే ఒక పెద్ద దానం. ఏ దానం ఇచ్చిన భక్తితో చేయాలి