Zodiac Signs : ఈ నెలలో కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్న రాశులు ఇవే…!
ప్రధానాంశాలు:
Zodiac Signs : ఈ నెలలో కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్న రాశులు ఇవే...!
Zodiac Signs : నవగ్రహాలను బుధుడు అత్యంత కీలకమైన గ్రహంగా భావిస్తారు. ఎందుకంటే బుధుడు Zodiac Signs తెలివితేటలకు , ఆలోచనలకు, హెచ్చుతగ్గులకు, భావవ్యక్తీకరణకు కారకుడు. అయితే జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉన్నట్లయితే ఆ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ఈ క్రమంలోనే ఈనెల 22వ తేదీన కుంభ రాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నారు. దీంతో నాలుగు రాశుల వారి జీవితాల పై సానుకూల ప్రభావాలు కనిపిస్తున్నాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
![Zodiac Signs ఈ నెలలో కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్న రాశులు ఇవే](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Zodiac-Signs-5.jpg)
Zodiac Signs : ఈ నెలలో కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్న రాశులు ఇవే…!
Zodiac Signs : వృషభ రాశి
ఈ రాశి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది సరైన సమయం. అయితే వీరికి అదృష్టం తోడవడంతో ఉద్యోగ అవకాశాలను అందుకుంటారు. ఏ పని చేస్తే అందులో విజయం సాధిస్తారు. ఇక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
Zodiac Signs : సింహరాశి
సింహరాశి జాతకులు ఈ సమయంలో నూతన ఆస్తులను వాహనాలను కొనుగోలు చేస్తారు. జీవిత భాగ్య స్వామితో సంతోషంగా గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. వీరికి అదృష్టం తోడవడంతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.
కుంభరాశి : కుంభ రాశి జాతకులకు సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఇక ఉద్యోగుల విషయానికొస్తే ఉద్యోగంలో పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది. సరైన సమయంలో పనులను పూర్తి చేసి సామర్ధ్యాన్ని నిరూపించుకుంటారు.
కన్యారాశి : కన్యారాశి జాతకులు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే కన్య రాశి వారు వారి ఆరోగ్యం పై మరియు కుటుంబ పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. వ్యాపారస్తులు వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. అలాగే మంచి లాభాలు అందుకుంటారు.