Aata Sandeep – Priyanka Jain : తొలి టాస్క్ గెలిచి సత్తా చాటిన ఆట సందీప్, ప్రియాంక జైన్.. ఓడిపోయానని వెక్కి వెక్కి ఏడ్చిన పల్లవి ప్రశాంత్

Advertisement

Aata Sandeep – Priyanka Jain : బిగ్ బాస్ హౌస్ లో తొలి టాస్క్ ప్రారంభం అయింది. తొలి టాస్క్ నే బిగ్ బాస్ భారీగా ప్లాన్ చేశాడు. బీట్ ది బీస్ట్ పేరుతో ఈ టాస్క్ ను నిర్వహించాడు బిగ్ బాస్క్. ఇప్పటి వరకు హౌస్ లో ఉన్న 14 మంది కంటెస్టెంట్లలో ఎవ్వరూ హౌస్ మెట్స్ గా కన్ఫమ్ కాలేదు. వాళ్లంతా కేవలం కంటెస్టెంట్లు మాత్రమే. వాళ్లు హౌస్ మెట్స్ గా కన్ఫమ్ కావడానికి టాస్క్ లు ఆడి గెలుచుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే హౌస్ లో తొలి టాస్క్ ను స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. అదే బీట్ ది బీస్ట్. ఈ టాస్క్ లో భాగంగా బాడీ బిల్డర్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Advertisement

ఆడవాళ్లకు సపరేట్ గా లేడీ బాడీ బిల్డర్, మగవాళ్లకు మగ బాడీ బిల్డర్ ను తీసుకొచ్చాడు బిగ్ బాస్. వాళ్లను హౌస్ లోకి పంపి లేడీ కంటెస్టెంట్లలో ఎవరు ఎక్కువ సేపు వాళ్లను ఎదుర్కొంటారో వాళ్లలో ఒకరు, మగవాళ్లలో ఎవరు ఎక్కువ సేపు బాడీ బిల్డర్ ను ఎదుర్కొంటారో వాళ్లలో ఒకరిని సెలెక్ట్ చేసి.. ఆ ఇద్దరికి మరో టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ లో గెలిచిన వాళ్లు బిగ్ బాస్ హౌస్ తొలి హౌస్ మేట్ అవుతారు.ఈ టాస్క్ లో భాగంగా చాలామంది నిమిషం లోపే రింగ్ లో నుంచి బాడీ బిల్డర్ ను ఎదుర్కోలేక బయటికి వచ్చేశారు. కానీ.. ఆట సందీప్, పల్లవి ప్రశాంత్, ప్రియాంకా జైన్, శోభా శెట్టి వీళ్లు మాత్రమే బాడీ బిల్డర్లతో ఎక్కువ సేపు ఫైట్ చేయగలిగారు.

Advertisement
aata sandeep and priyanka jain wins the beat the beast in bigg boss 7 telugu
aata sandeep and priyanka jain wins the beat the beast in bigg boss 7 telugu

Aata Sandeep – Priyanka Jain : నిమిషం 49 సెకన్లు రింగ్ లో బాడీ బిల్డర్ తో పోరాడిన ఆట సందీప్

అందులో ఆట సందీప్ 1 నిమిషం 49 సెకన్లు ఉండగా, పల్లవి ప్రశాంత్ 1 నిమిషం 44 సెకన్లు మాత్రమే ఉన్నాడు. అంటే ఇద్దరి మధ్య తేడా 5 సెకన్లు మాత్రమే. 5 సెకన్లలోనే అన్నీ తారుమారైపోయాయి అన్నమాట. 5 సెకన్ల తేడాతో నేను ఓడిపోయా అని పల్లవి ప్రశాంత్ వెక్కి వెక్కి ఏడ్చాడు.

ఇక లేడీ కంటెస్టెంట్లలో 1 నిమిషం 7 సెకన్లు ఉండి ప్రియాంక టాప్ లో నిలవగా, 57.3 సెకన్లతో శోభాశెట్టి రెండో స్థానంలో నిలిచింది. అయితే.. మగ కంటెస్టెంట్ల నుంచి ఒకరు ఆట సందీప్, లేడీ కంటెస్టెంట్ల నుంచి ఒకరు ప్రియాంక జైన్.. ఈ ఇద్దరిలో ఒకరు చివరకు విజేతగా నిలవబోతున్నారు. ఇద్దరికీ మరో టాస్క్ ను బిగ్ బాస్ ఇవ్వనున్నాడు.

Advertisement
Advertisement