Actor : స్టార్ హీరోల‌తో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్‌ని ఇప్పుడు ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Actor : స్టార్ హీరోల‌తో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్‌ని ఇప్పుడు ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదా..?

 Authored By ramu | The Telugu News | Updated on :11 July 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Actor : స్టార్ హీరోల‌తో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్‌ని ఇప్పుడు ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదా..?

Actor : చిన్నప్పటినుంచి వెండితెరపై మెరిసిన వ్య‌క్తి ఇప్పుడు హీరోగా తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న మహేంద్రన్ ..ప్రేమ, భానుచందర్, వనీత విజయ్ కుమార్ నటించిన ‘దేవి’ సినిమాలో చిన్నపిల్లాడిగా క‌నిపించి అల‌రించాడు. మహేంద్రన్ తెలుగులో ‘ఆహా’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘దేవి’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘నీ స్నేహం’, ‘లిటిల్ హార్ట్స్’ లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు సంపాదించాడు.

Actor స్టార్ హీరోల‌తో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్‌ని ఇప్పుడు ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదా

Actor : స్టార్ హీరోల‌తో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్‌ని ఇప్పుడు ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదా..?

Actor : అవ‌కాశాలే లేవు..

ముఖ్యంగా దేవి మరియు లిటిల్ హార్ట్స్ సినిమాల్లో తన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన మహేంద్రన్, నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు.మహేంద్రన్ చిన్న వయసులోనే 130కి పైగా సినిమాల్లో నటించాడు..బాల నటుడిగా ఫేమస్ అయిన మహేంద్రన్, అనంతరం చదువులపై దృష్టి పెడుతూ సినిమాలకు స్వల్ప విరామం ఇచ్చాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత మహేంద్రన్ తిరిగి తెరపైకి వచ్చాడు .

తమిళంలో ప్రాధాన్యమున్న పాత్రలతో పాటు, హీరోగా కూడా పలు చిత్రాల్లో కనిపిస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో మహేంద్రన్ తన కెరీర్ పై అనుభూతులు పంచుకున్నాడు.“ఒకప్పుడు నాకోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూశారు. ఒకే రోజు నాలుగు సినిమాలు చేశాను. నైట్ షూట్స్ ఎక్కువగా నాకోసమే ప్లాన్ చేసేవాళ్లు,” అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. పెద్దయ్యాక మాత్రం అవకాశాలే రాలేదు. చాలా స్ట్రగుల్ తర్వాత మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది